కువైట్‌లో 7 మంది ఏ.పి వాసుల అరెస్ట్..

- November 28, 2019 , by Maagulf
కువైట్‌లో 7 మంది ఏ.పి వాసుల అరెస్ట్..

కువైట్: కువైట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 7 మందిని  నేర పరిశోధన విభాగం అధికారులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా గత కొంతకాలంగా నకిలీ భారతీయ రాయబార కార్యాలయ ముద్రలను ఉపయోగించి ధృవీకరణ పత్రాలను జారీ చేస్తున్నట్లు గుర్తించారు. కొన్ని రోజులుగా ఈ ముఠాపై నిఘా పెట్టిన అధికారులు తాజాగా వీరిని భారత ఎంబసీ పరిసరాల్లో ధృవపత్రాలను ఫోర్జరీ చేస్తుండగా రెడ్ హ్యాడెండ్‌గా పట్టుకున్నారు. ఈ గ్యాంగ్‌కు డ్రైవింగ్ లైసెన్స్‌ను ఫోర్జరీ చేయడంలో కూడా నైపుణ్యం ఉన్నట్లు దర్యాప్తు బృందం గుర్తించింది.

దర్యాప్తులో భాగంగా డిపార్ట్‌మెంట్‌కు చెందిన అధికారి ఒకరు ఈ ముఠాలోని ఓ సభ్యుడిని సాధారణ వ్యక్తిలా వెళ్లి తనకు డ్రైవింగ్ లైసెన్స్ కావాలని కోరాడు. వెంటనే అధికారికి సదరు సభ్యుడు వివరాలు ఇచ్చి వెళ్తే మూడు రోజుల తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొవచ్చని చెప్పాడు. దాంతో మూడు రోజుల తర్వాత ఇన్విస్టిగేషన్ అధికారులు నేరుగా వెళ్లి ఆ సభ్యుడిని నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌తో సహా రెడ్ హ్యాడెండ్‌గా పట్టుకున్నారు. అనంతరం అతడు ఇచ్చిన సమాచారంతో మిగతా ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.

ఆ తరువాత ఈ గ్యాంగ్ నివాసముంటున్న ఇళ్లల్లో సోదాలు చేసి కువైట్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ముద్రలు, ఎంబసీ పేరు మీద అనుమానం రాకుండా పత్రాలను ఫోర్జరీ చేసేందుకు ఉపయోగిస్తున్న హై రిజల్యూషన్ ప్రింటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఈ ఏడుగురు నిందితులు ముఠాగా ఏర్పడి వాట్సాప్ ద్వారా పనిచేస్తున్నట్లు తేలింది. వాట్సాప్ వాయిస్ క్లిప్‌ల ద్వారా డీల్స్ చేసుకొని భారీ మొత్తంలో ధృవీకరణ పత్రాలను ఫోర్జరీ చేస్తున్నారు. హై రిజల్యూషన్ పద్ధతులను ఉపయోగించి భారత రాయబార కార్యాలయం ముద్ర, అధికారుల సంతకాలను సైతం ఈ ముఠా ఫోర్జరీ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ ముఠా ఇలా నకిలీ పత్రాల ద్వారా నెలకు సుమారు రూ. 10లక్షల వరకు సంపాదిస్తున్నట్లు తెలిసింది. ఏడుగురు సభ్యుల ఇండ్ల నుంచి భారీ మొత్తంలో నగదు, బంగారం, ఖరీదైన వాచీలను దర్యాప్తు బృందం స్వాధీనం చేసుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com