షాద్ నగర్:మహిళా డాక్టర్ సజీవ దహనం

- November 28, 2019 , by Maagulf
షాద్ నగర్:మహిళా డాక్టర్ సజీవ దహనం

హైదరాబాద్:రోజు రోజుకు నగరంలో హత్యలు పెరిగిపోతున్నాయి. పట్టపగలు మహిళలు ఒంటరిగా తిరగాలంటేనే భయపడుతున్నారు. అలాంటిది రాత్రి సమయంలో ఒంటరిగా తిరగడం అంటే ప్రాణాల మీద ఆశను వదిలేసుకోవడమే. ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ.. రాత్రి పగలు తేడా లేకుండా మగాళ్లతో సమానంగా మహిళలు కూడా కష్టపడుతున్నారు. అయితే, సేఫ్టీ మాత్రం చాలా తక్కువే అని చెప్పాలి. నగరంలో ఎక్కడో ఒక చోట ప్రతిరోజు హత్యలు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి.
నగర శివార్లలోని షాద్ నగర్ లో ఇలాంటి హత్య ఒకటి జరిగింది. కొల్లూరులో ప్రియాంక రెడ్డి వెటర్నరీ డాక్టర్ గా పనిచేస్తోంది. వీరి కుటుంబం శంషాబాద్ లో నివాసం ఉంటున్నారు. అయితే, శంషాబాద్ నుంచి తన స్కూటీపై హాస్పిటల్ కు వెళ్లి తిరిగి వస్తుండగా తన స్కూటీ పాడైపోయినట్టు తెలుస్తోంది. అదే సమయంలో ప్రియాంక రెడ్డి తన సోదరితో ఫోన్ లో మాట్లాడింది. స్కూటీ చెడిపోయిందని, భయంగా ఉందని, చుట్టూ లారీ డైవర్లు ఉన్నారని సోదరితో భయంగా చెప్పింది.
మాదాపూర్ లోని హాస్పిటల్ కు వెళ్లి రాత్రి 9:30 గంటల సమయంలో శంషాబాద్ కు వచ్చింది. ఆ తరువాత ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉన్నది. తెల్లారే సరికి శంషాబాద్ పరిసర ప్రాంతాల్లోని ఓ బ్రిడ్జి కింద శవమై కనిపించింది. ఆమెను ఎవరో దుండగులు హత్య చేసి బ్రిడ్జి కిందకు తీసుకొచ్చి పెట్రోల్ పోసి తగలబెట్టారు. తెల్లారే సరికి ప్రియాంక రెడ్డి మృతదేహం పూర్తిగా కాలిపోయింది. స్కూటీ పంచర్ కావడంతో లారీ డ్రైవర్లు స్కూటీని తీసుకెళ్లారని తెలుస్తోంది.
ఆ తరువాత ఎం జరిగిందో తెలియదు. తెల్లారే సరికి ఆమె పూర్తిగా కాలిపోయిన స్థితిలో శవమై కనిపించింది. స్కూటీ ఏమైందో ఇప్పటి వరకు సస్పెన్స్ గా మారింది. ఎవరు చంపారు.. ఎందుకు చంపారు అన్నది తెలియాల్సి ఉన్నది. హత్య మాత్రమే చేశారా.. లేదంటే అత్యచారం చేసి హత్య చేశారా అనే విషయాలపైనా పోలీసులు దృష్టి సారించారు. యువతి మృతదేహం పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉండటంతో అక్కడే ఆ యువతి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com