భారత్, శ్రీలంక మైత్రీ మరింత బలోపేతం : శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స
- November 29, 2019
భారత్, శ్రీలంక దేశాల మధ్య మైత్రీ సంబంధాలు బలంగా ఉన్నాయని, వీటిని మరింత ఉన్నతస్థాయికి తీసుకువెళతామని శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స అన్నారు. ఇటీవల శ్రీలంక అధ్యక్షుడిగా ఎన్నికైన రాజపక్స తొలిసారి విదేశీ పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఈమేరకు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. కాగా రెండు రోజుల పర్యటన కోసం భారత్‌కు వచ్చిన రాజపక్సకు రాష్టప్రతి భవన్ వద్ద రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ సాదర స్వాగతం పలికారు. అనంతరం రాజపక్స విదేశాంగ మంత్రి జైశంకర్‌ను కలుసుకున్నారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







