గల్ఫ్ వలస కార్మికులకు పెన్షన్ పథకం

- November 30, 2019 , by Maagulf
గల్ఫ్ వలస కార్మికులకు పెన్షన్ పథకం

తెలంగాణ:గల్ఫ్ వలస కార్మికులు కూడా కేంద్ర ప్రభుత్వ పెన్షన్ పథకంలో చేరవచ్చునని జగిత్యాల కార్మిక శాఖ అధికారి ఎ. రాజేశ్వరమ్మ అన్నారు. కేంద్ర కార్మిక శాఖ పిలుపుమేరకు జగిత్యాలజిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం (30.11.2019) జరిగిన పెన్షన్ వారోత్సవం కార్యక్రంలో ఆమె పాల్గొన్నారు. భారత దేశంలో నెలసరి రూ.15 వేల కంటే తక్కువ ఆదాయం కలిగిన అసంఘటితరంగ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ అనే పెన్షన్ పథకం ప్రవేశపెట్టిందని ఆమె అన్నారు.

గల్ఫ్ దేశాలలో ఉన్న వలస కార్మికులు నేషనల్ పెన్షన్ సిస్టం (ఎన్ పి ఎస్) లో చేరవచ్చునని, వివరాలకు http://www.npstrust.org.in/sites/default/files/NRI_eNPS_FAQ.pdf వెబ్ సైటును సందర్శినచవచ్చునని ఆమె అన్నారు. గల్ఫ్ కార్మికుల కోసం ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ ప్రచురించిన అవగాహన చైతన్య కరపత్రాన్ని రాజేశ్వరమ్మ ఈ సందర్బంగా ఆవిష్కరించారు. 

విజిట్ వీసాపై వెళ్ళవద్దు   

గల్ఫ్ దేశాలకు విజిట్ వీసాపై వెళితే అక్రమ వలసదారులుగా మారి హక్కులు కోల్పోతారని, ప్రభుత్వ గుర్తింపు పొందిన రిక్రూటింగ్ ఏజెన్సీల ద్వారా ఉద్యోగ వీసాపై మాత్రమే వెళ్లాలని ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్వదేశ్ పరికిపండ్ల సూచించారు. రూ.10 లక్షల విలువైన ప్రవాసి భారతీయ బీమా యోజన అనే ప్రమాద బీమా పాలసీ లేనిదే ప్లయిట్ ఎక్కకూడదని అన్నారు. ప్రవాసి ఇన్సూరెన్స్ పాలసీ కోసం గల్ఫ్ ఏజెంట్లను నిలదీయాలని, పాలసీ జారీచేయని పక్షంలో సమీప పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు. గల్ఫ్ దేశాలకు చట్టబద్దంగా వెళితే సురక్షితంగా ఉంటారని, తగిన నైపుణ్య శిక్షణ తీసుకొని వెళితే మంచి ఉద్యోగం, మంచి జీతం లభిస్తుందని ఆయన అన్నారు. 

5న లక్ష్మీపూర్ లో అవగాహన 

కార్మిక శాఖ ఆధ్వర్యంలో  జగిత్యాల మండలం లక్ష్మీపూర్ లో డిసెంబర్ 5న భవన మరియు ఇతర నిర్మాణ రంగ కార్మికులతో పాటు గల్ఫ్ వలస కార్మికుల అవగాహన కార్యక్రమం నిర్వహిస్తామని ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి జయపాల్ నల్లాల తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్మిక అధికారి అనిల్, విద్యాధికారి మద్దెల నారాయణ, మెప్మా ప్రతినిధి సునీత, సి ఎస్ సి జిల్లా మేనేజర్ సతీష్, భారతీయ మజ్దూర్ సంఘ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎం. సుధీర్, కార్మిక నాయకులు సత్యనారాయణ, గంగం స్వామి, పవన్ తదితరులు పాల్గొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com