సిడ్నీ:డిప్యూటీ కాన్సుల్‌ జనరల్‌గా తెలంగాణ వాసి

సిడ్నీ:డిప్యూటీ కాన్సుల్‌ జనరల్‌గా తెలంగాణ వాసి

ఆస్ట్రేలియా సిడ్నీలో గల భారత దౌత్య కార్యాలయ డిప్యూటీ కాన్సుల్‌ జనరల్‌గా వరంగల్‌ తూర్పు నియోజకవర్గం రామావారి వీధికి చెందిన ములక సంజయ్‌కుమార్‌ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఢిల్లీలోని సౌత్‌బ్లాక్‌ గల్ఫ్‌ డివిజన్‌ అండర్‌ సెక్రటరీగా పని చేసిన ఆయనను ఆస్ట్రేలియాకు బదిలీ చేస్తూ భారత విదేశాంగ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2011లో ఐఎఫ్‌ఎస్‌కు ఎంపికైన సంజయ్‌.. 2013 ఆగస్టులో ఈజిప్టు భారత రాయబార కార్యాలయంలో తృతీయ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం సుడాన్‌లోని పని చేశారు.

Back to Top