'శ్రీదేవి' జీవిత చరిత్ర పుస్తక ఆవిష్కరణ
- December 02, 2019
దివంగత నటి శ్రీదేవి జీవిత చరిత్ర పుస్తక రూపంలో రానుంది. 'శ్రీదేవి : ది ఎటర్నల్ స్క్రీన్ గాడెస్' అనే టైటిల్‌తో ప్రముఖ రచయిత సత్యార్థ్ నాయక్ ఈ పుస్తకాన్ని రచించారు. పెంగ్విన్ ఇండియా సంస్థ ఈ పుస్తకాలను ప్రచురించింది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొణే.. శ్రీదేవి భర్త, ప్రముఖ నిర్మాత బోనికపూర్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుసక్తానికి బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ ముందు మాట రాయడం విశేషం. 'ఐకాన్ శ్రీదేవిగారి నటనా జీవితం ఎంతో మందికి స్ఫూర్తి దాయకం. ఆమె సినిమాలను చూస్తూ పెరిగాను. నటనలో ఆమె ఒక ఇన్సిస్టిట్యూట్.. ఆమె పుస్తకానికి ముందుమాట రాసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని కాజోల్ ట్వీట్ చేసింది. శ్రీదేవి చిన్నతనం నుండి స్టార్ హీరోయిన్‌గా ఎదిగే వరకు ఆమె ఎదుర్కొన్న పరిస్థితులు, పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌కి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను రచయిత సత్యార్థ్ నాయక్ ఈ పుస్తకంలో పొందుపరిచారు.
తాజా వార్తలు
- సిక్కిం ఘటనపై భారత్‌కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్‌లో భారత పాస్‌పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్‌లో భారత రాయబారి విపుల్‌కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్







