శ్రీదేవి ఆటో బయోగ్రఫీ విడుదల
- December 02, 2019
దివంగత అందాల తార, అతిలోక సుందరి శ్రీదేవి జీవిత చరిత్ర 'శ్రీదేవి : ది ఎటెర్నల్ స్క్రీన్ గాడెస్' అనే పుస్తక రూపంలో రానుంది. ప్రముఖ రచయిత సత్యార్థ్ నాయక్ ఈ పుస్తకాన్ని రచించారు. పెంగ్విన్ ఇండియా సంస్థ ఈ పుస్తకాలను ప్రచురించింది. ఇండియా హాబీటాట్ సెంటర్ ఢిల్లీ లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ప్రముఖ బాలీవుడ్ కథా నాయిక దీపికా పదుకొనె, శ్రీదేవి భర్త, ప్రముఖ నిర్మాత బోనికపూర్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఈ పుసక్తానికి ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ ముందు మాట రాయడం విశేషం.
'ఐకాన్ శ్రీదేవిగారి నటనా జీవితం ఎంతో మందికి స్ఫూర్తి దాయకం. ఆమె సినిమాలను చూస్తూ పెరిగాను. నటనలో ఆమె ఒక ఇన్సిస్టిట్యూట్.. ఆమె పుస్తకానికి ముందుమాట రాసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు కాజోల్.
శ్రీదేవి చిన్నతనం నుండి స్టార్ హీరోయిన్‌గా ఎదిగే వరకు ఆమె ఎదుర్కొన్న పరిస్థితులు, పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌కి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను రచయిత సత్యార్థ్ నాయక్ సవివరంగా ఈ పుస్తకంలో పొందుపరిచారు. 'శ్రీదేవి : ది ఎటెర్నల్ స్క్రీన్ గాడెస్' బుక్ కోసం శ్రీదేవి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తాజా వార్తలు
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!