దుబాయ్:'GWAC' ఆధ్వర్యంలో 48వ నేషనల్ డే వేడుకలు

దుబాయ్:'GWAC' ఆధ్వర్యంలో 48వ నేషనల్ డే వేడుకలు

దుబాయ్:దుబాయ్ లోని బర్ దుబాయ్ లో 'గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక' ఆధ్వర్యంలో 48వ యుఏఈ నేషనల్ డే వేడుకలు తెలంగాణ గల్ఫ్ కార్మికులు ఘనంగా జరిపారు.
తెలంగాణ మరియు సాటి తెలుగు రాష్ట్రంనుండి లక్షలమంది కార్మికులకు యుఏఈ దేశం ఉపాధి కల్పిస్తుంది, బతుకుతెరువు నిస్తున్న దేశాన్ని మరియు దేశ జెండాను గౌరవించాలనే గొప్ప ఉద్దేశంతో ఈరోజు యుఏఈ దేశ జాతీయదినోత్సవాన్ని వందలాది కార్మికులందరూ ఒక పండుగలా జరుపుకున్నారు,యుఏఈ దేశ జెండాకు వందనం చేస్తూ కేక్ కట్ చేసి శుభకాంక్షలు తెలియజేసుకున్నారు.


నాయకులు మాట్లాడుతూ మనకు ఉపాధి చూపిస్తూ ఎందరో జీవితాల్లో వెలుగులు నింపుతూ అన్నం పెడుతున్న దేశాన్ని గారవించాలని తెలిపారు.ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాలకు చెందిన కార్మికులతో పాటు చాలా మంది కమ్యూనిటీ నాయకులు మరియు సామాజికవేత్తలు GWAC సభ్యులు మరియు వందలాది కార్మికులు పాల్గొన్నారు.

Back to Top