కువైట్‌:టీఆర్‌ఎస్ ఎన్నారై సెల్ ఆధ్వర్యంలో ఘనంగా 'దీక్షా దివస్'

కువైట్‌:టీఆర్‌ఎస్ ఎన్నారై సెల్ ఆధ్వర్యంలో ఘనంగా 'దీక్షా దివస్'

కువైట్:తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ చేపట్టిన దీక్షకు పది సంవత్సరాలు, తెలంగాణ  రాష్ట్ర సాధన కోసం 29 నవంబర్, 2009న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన విషయం మనందరికీ తెలిసిందే. తెలంగాణ ఉద్యమ గతిని దీక్షా దివస్ మార్చేసింది. తెలంగాణ సమాజం యావత్తు కేసిఆర్ వెంట నిలవడంతో.. కేంద్రం మెడలు వంచి చివరకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. ఈ సందర్భంగా దీక్షా దీవస్ స్ఫూర్తిని, అమరుల త్యాగాలని, జ్ఞాపకాలను, పోరాటాలను TRS కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల మరియు కమిటీ సభ్యులు కలిసి గుర్తుచేసుకున్నారు, సమ్మెలో పాల్గొన్న ఆర్టీసి కార్మీకులని మల్లి ఉద్యోగం లోకి అనుమతించి కార్మికులకు కన్న తండ్రి లాగా కేసిఆర్  ఆదుకున్నారు అని పేర్కొన్నారు. 

అద్భుతమైన ప్రజా సంక్షేమ పథకాలతో బంగారు తెలంగాణ సాధన దిశగా ముందుకెళ్లాలని ఆకాంక్షిస్తు, దానికి ఎల్లప్పుడూ కెసిఆర్ కి TRS పార్టీ కి తెలంగాణ ప్రజల ఆశీర్వాదాలు ఉంటాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో కువైట్ ప్రెసిడెంట్ అభిలాష గొడిశాల,కొండల్ రెడ్డి, సరోజ భాను,గంగాధర్, సురేష్ గౌడ్ ,రవి గన్నారపు ,రమేష్ ఓరుగంటి, హరీష్ మోడెం,రవి సుధగాని, తెలు నర్సయ్య, సుభాష్ తదితరులు పాల్గొన్నారు.


--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Back to Top