112 ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి..
- December 03, 2019
న్యూఢిల్లీ:కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి లోక్‌సభలో మాట్లాడుతూ.. 112 ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. 112 ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నంబర్ దేశ వ్యాప్తంగా అమలవుతుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. 112 హెల్ప్‌లైన్‌కు సంబంధించి రాష్ర్టాలకు నిధులు కూడా మంజూరు చేశామని ఆయన తెలిపారు. రైల్వే స్టేషన్ల వద్ద జీఆర్పీ, పోలీసులు, విమానాశ్రయాల వద్ద సీఐఎస్‌ఎఫ్ బలగాలు భద్రతను కల్పిస్తున్నాయని కిషన్ రెడ్డి తెలిపారు. 112.. ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నెంబర్. మీరు ఎమర్జెన్సీ సమయంలో ఈ ఒక్క నెంబర్ కు ఫోన్ చేస్తే చాలు.. క్షణాల్లో స్పందించి మీకు తక్షణ సాయం అందించే అవకాశం ఉంటుంది. ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ (ERSS) కింద 112 ఏకైక ఎమర్జెన్సీ నెంబర్ ను లాంచ్ చేశారు. సెంటర్ ఫర్ డెవలప్ మెంట్ ఆఫ్ అడ్వాన్స్ డ్ కంప్యూటింగ్ (CDAC)ఈ హెల్ప్ లైన్ నంబర్ టెక్నాలజీని డిజైన్ చేసింది.
ఈఆర్ఎస్ఎస్
ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ (ERSS). అత్యవసర సమయాల్లో తక్షణ సాయం పొందేందుకు ఈ విధానాన్ని రూపొందించారు. ఈ వ్యవస్థకు వాయిల్ కాల్స్, ఎస్ఎంఎస్, ఈమెయిల్, ఈఆర్ఎస్ఎస్ వెబ్ సైట్, ప్యానిక్ బటన్ వంటి అన్నీ ఎమర్జెన్సీ సిగ్నల్స్ మీ ఫోన్ నుంచే సిగ్నల్స్ అందుతాయి. ఈ వ్యవస్థను మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు ఈఆర్సీని (ERC) ఇంటిగ్రేట్ చేశారు. టెలికం సర్వీసు ప్రొవైడర్స్ అందించే లొకేషన్ బేసిడ్ సర్వీసు ఆధారంగా ఇదంతా పనిచేస్తుంది.
ఎమర్జెన్సీ నంబర్ ఎలా పనిచేస్తుందంటే..
-ఎమర్జెన్సీ అవసరమైతే.. మీ ఫోన్ నుంచి సింగిల్ ఎమర్జెన్సీ నంబర్ 112 కు డయిల్ చేయాలి. -మీ ఫోన్ పవర్ బటన్ ను మూడుసార్లు గట్టిగా ప్రెస్ చేయాలి. అప్పుడు వెంటనే ఎమర్జెన్సీ నెంబర్ కు కాల్ వెళ్తుంది. -స్మార్ట్ ఫోన్ లేని పక్షంలో బేసిక్ ఫీచర్ ఫోన్ ఏదైనా సరే.. 5, లేదా 9 నెంబర్ ప్రెస్ చేస్తే వెంటనే ఈఆర్ఎస్ఎస్ కు సమాచారం వెళ్తుంది. -ERSS వెబ్ సైట్ కు వెళ్లి అక్కడ ఎమర్జెన్సీ హెల్ప్ కోరొచ్చు. -మీ స్మార్ట్ ఫోన్ లో 112 ఇండియా అనే యాప్ ఉంటుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ యాప్ నుంచి తక్షణ సాయం పొందొచ్చు. ఇందులో అలర్ట్ మెసేజ్ లు, లొకేషన్ డేటా, 112 ఎమర్జెన్సీ కాల్ చేయొచ్చు. -మహిళల కోసం ప్రత్యేకించి 112 ఇండియా యాప్ లో 'SHOUT' అనే ఫీచర్ అందుబాటులో ఉంది. ఇందులో మహిళలు అత్యవసర సమయాల్లో ERC సెంటర్ నుంచి తక్షణ సాయం పొందొచ్చు.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







