హస్తిన లో కె.సి.ఆర్...

హస్తిన లో కె.సి.ఆర్...

తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రస్తుతం ఢిల్లీ టూర్లో ఉన్నారు. ఆయన హస్తిన టూర్లో బిజీగా గడుపుతున్నారు. ఎందుకు వచ్చారు, ఎవరిని కలుస్తారన్నది అధికారికంగా తెలియకపోయినా కె.సి.ఆర్ టూర్ మాత్రం ఆసక్తికరంగానే ఉంది. హైదరాబాద్ లో గత బుధవారం యువ పశువైద్యురాలు దిశ దారుణంగా ఆత్యాచారం, హత్య జరిగి బలి పోయిన సంగతి విధితమే. దిశ వ్యవహారం నాటి నుంచి దేశాన్ని గట్టిగా కుదిపేస్తోంది.

ఈ నేపధ్యంలో కె.సి.ఆర్ ఢిల్లీ టూర్ పెట్టుకోవడంపైన చర్చ సాగుతోంది. కె.సి.ఆర్ ఢిల్లీ టూర్లో ప్రధాని నరేంద్ర మోడీని కలుస్తారని అంటున్నారు. కె.సి.ఆర్ ఇందుకోసమే వచ్చారని కూడా చెబుతున్నారు. అత్యాచారం జరిపిన వారిని వెంటనే శిక్షించే విధంగా కఠిన చట్టలు ఉండాలని కె.సి.ఆర్ కోరుకుంటున్నారని అంటున్నారు.
ఇదే విషయాన్ని ఆయన ప్రదానితో చెబుతారని అంటున్నారు. మరో వైపు కె.సి.ఆర్ ఢిల్లీలో జరిగే ఓ పెళ్ళికి హారజయ్యేందుకు వచ్చారని కూడా జాతీయ మీడియా అంటోంది. ఇదిలా ఉండగా జతీయ మీడియా కంటపడిన కె.సి.ఆర్ని అసలు వదలకుండా ప్రశ్నల వర్షం కురిపించారని అంటున్నారు.

కె.సి.ఆర్ దిశ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదని జాతీయా మీడియా గులాబీ బాస్ నే డైరెక్ట్ గా ప్రశ్నించిందని టాక్. అయితే దీనికి కె.సి.ఆర్ సమాధానం చెప్పకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయారని అంటున్నారు. అదే విధంగా కె.సి.ఆర్ ఇప్పటివరకూ దిశ కుటుంబాన్ని పరామర్శించలేదు, ఆయన కుమారుడు మంత్రి అయిన కె.టి.ఆర్  సైతం ఆ వైపుగా వెళ్ళలేదు, దీన్ని నేషనల్ మీడియా గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తోంది. మరి ఈ నేపధ్యంలో హైదరాబాద్ వచ్చాకైనా కె.సి.ఆర్ సార్ పరామర్శిస్తారా.

మొత్తం మీద కె.సి.ఆర్ ఢిల్లీ టూర్ ఒక వైపు, మరో వైపు దిశ హత్యోదంతంపైన పెల్లుబుకుతున్న ఆవేశాలు, ప్రధానితో భేటీ ఇవన్నీ చూసుకున్నపుడు గులాబీబాస్ టూర్ పైన అందరూ ద్రుష్టి సారించారు. మరి ప్రధానితో భేటీ తరువాత కె.సి.ఆర్ ఏం చేస్తారో, ఏం చెబుతారో చూడాలి.

Back to Top