ఐపీఎల్‌ వేలం కోసం 971 మంది పేర్లు నమోదు

ఐపీఎల్‌ వేలం కోసం 971 మంది పేర్లు నమోదు

ఐపీఎల్‌-2020 కోసం జరిగే వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు 971 మంది క్రికెటర్లు ముందుకు వచ్చారు. తుది గడువు నవంబర్‌ 30లోగా వీరంతా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇందులో 713 మంది భారత ఆటగాళ్లు కాగా, 258 మంది విదేశీయులు. భారత క్రికెటర్లలో 19 మంది జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించగా. 634 మంది ఎప్పుడూ టీమిండియా తరఫున ఆడలేదు. అయితే 971 మంది నుంచి తాము కోరుకుంటున్న ఆటగాళ్ల పేర్లను ఎనిమిది ఫ్రాంచైజీలు డిసెంబర్‌ 9లోగా సమర్పించాల్సి ఉంటుంది. ఆ జాబితాలో ఉన్న వారికే వేలంలో చోటు దక్కుతుంది.

Back to Top