దుబాయ్: మీరు విమానంలో ప్రయాణిస్తున్నారా? అయితే మీ బ్యాగేజ్ లో ఇవి లేకుండా చూసుకోండి....

- December 05, 2019 , by Maagulf
దుబాయ్: మీరు విమానంలో ప్రయాణిస్తున్నారా? అయితే మీ బ్యాగేజ్ లో ఇవి లేకుండా చూసుకోండి....

దుబాయ్: దుబాయ్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఇతర దేశాలకు వెళ్లే ప్రయాణీకులు లగేజ్‌లో అనేక వస్తువులను సర్దుకుంటారు. అయితే దుబాయ్ ఎయిర్‌పోర్టు అధికారులు అనేక వస్తువులపై నిషేధం పెట్టినట్టు చెబుతున్నారు. చాలా మంది ప్రయాణికులకు ఏ వస్తువులపై నిషేధం వహించారన్నది తెలియక ఎయిర్‌పోర్టులో విలువైన వస్తువులను సతమతమవుతున్నారు. దుబాయ్ పోలీసులు తాజాగా ఏ వస్తువులపై నిషేధం ఉందో.. వాటికి సంబంధించిన ఫొటోలను తమ ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

దుబాయ్ ఎయిర్‌పోర్టులలో నిషేధించిన వస్తువుల జాబితా:

స్మార్ట్ బ్యాలెన్స్ వీల్స్(వీటినే హోవర్‌బోర్డ్స్ అని కూడా పిలుస్తుంటారు)
కెమికల్స్
మెటాలిక్ ఐటమ్స్(పెద్ద సైజు కలిగినవి)
కార్ స్పేర్ పార్ట్స్
గ్యాస్ సిలిండర్లు(అన్ని రకాలు)
బ్యాటరీలు(లిథియమ్ బ్యాటరీతో సహా)
టార్చ్ లైట్లు
పేలుడుకు సంబంధించిన లిక్విడ్స్(పేలుడుకు సంబంధం లేని అధిక మోతాదులో ఉన్న లిక్విడ్స్ కూడా)
ఈ-సిగరెట్స్
పవర్ బ్యాంక్స్

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com