నకిలీ గుర్తింపు కార్డు కలిగిన వ్యక్తి అరెస్ట్
- December 06, 2019
దుబాయ్:నకిలీ గుర్తింపు కార్డు కలిగిన ఓ నైజీరియా వ్యక్తికి దుబాయ్ న్యాయస్థానం మూడు నెలల జైలు శిక్ష విధించింది. మనీ ఎక్సేంజ్ ఆఫీస్‌లో మరో వ్యక్తికి చెందిన ఎమిరేట్స్ ఐడీ కార్డును చట్టవిరుద్ధంగా వినియోగించటంతో దోషికి న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది. అతని శిక్షా కాలం పూర్తైన వెంటనే బహిష్కరణ అమల్లోకి వస్తుందని న్యాయస్థానం తెలిపింది.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ రికార్డ్స్ ప్రకారం..శిక్ష పడిన నైజీరియన్ విజిట్ విసాపై దుబాయ్ వచ్చినట్లు తెలిపారు. గత నవంబర్ 11న నైఫ్ లోని మనీ ఎక్సేంజ్ కు వెళ్లిన నైజీరియన్, కెన్యా పౌరుడికి చెందిన ఎమిరేట్స్ ఐడీని తనదిగా చెప్పుకొని మోసానికి పాల్పడినట్లు పేర్కొన్నారు.
భారత్ కు చెందిన ఓ ఉద్యోగి మాట్లాడుతూ..తమ వద్దకు నైజీరియన్ మధ్యాహ్నం ఒంటి గంటా నలభైఐదు నిమిషాల సమయంలో వచ్చినట్లు వివరించారు. ఓమన్ పంపించేందుకు డబ్బు కలెక్ట్ చేస్తున్నట్లు చెప్పాడని వెల్లడించాడు. అయితే..తాను గుర్తింపు కార్డు అడగటంతో కెన్యాకు చెందిన వ్యక్తి ఐడీ కార్డును చూపించాడని భారతీయ ఉద్యోగి దోషి చేసిన మోసాన్ని వివరించాడు. పైగా నిందితుడి వ్యక్తిగత వివరాలు, ఐడీ కార్డులో పేర్కొన్న వివరాలతో సరిపోలేదని, దాంతో పోలీసులకు సమాచారం అందించడంతో అతన్ని అరెస్ట్ చేశారని వివరించాడు.
పోలీసులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ విచారణలో నైజీరియన్ తనపై మోపిన అభియోగాలను అంగీకరించినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో అతని నుంచి ఐడీ కార్డును స్వాధీనం చేసుకున్నారు. అయితే..ప్రస్తుత తీర్పుపై దోషి అప్పీల్ కు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







