ఒమన్‌లో ప్రవాసీయులకు కొత్త మార్గనిర్దేశకాలు జారీ
- December 07, 2019
ఒమన్ లోని ప్రవాస భారతీయులకు ఇచ్చే గుర్తింపు కార్డు( ఓవర్సీస్ సిటీజన్ ఆఫ్ ఇండియా కార్డు-ఓసీఐ)లకు సంబంధించి భారత రాయబార కార్యాలయం కొత్తగా కొన్ని కీలక మార్గనిర్దేశకాలు జారీ చేసింది. 20 ఏళ్లలోపు ఉన్నవారికి అలాగే 50 ఏళ్ల వయస్సు పైబడిన వారికి ఈ మార్గనిర్దేశకాలు వర్తించనున్నాయి.
20 ఏళ్లలోపు ఉండే కార్డ్ హోల్డర్లు..కొత్త పాస్ పోర్టు పొందిన ప్రతీసారి ఓసీఐ కార్డు తిరిగి పొందాల్సి ఉంటుందని వెల్లడించింది. ఇక 50 ఏళ్లు పూర్తి చేసుకున్న వారు కొత్త పాస్ పోర్టుతో సంబంధం లేకుండా తప్పనిసరిగా ఓసీఐ పొందాల్సి ఉంటుందని రాయబార కార్యాలయం వివరించింది. అయితే..21 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్కులకు మాత్రం ఈ నిబంధనలు వర్తించవు. వారు కొత్త పాస్ పోస్ట్ తీసుకున్న ప్రతీసారి ఓసీఐ తీసుకొవాల్సిన అవసరం లేదని రాయబార కార్యాలయ వర్గాలు తెలిపాయి.
ఓసీఐ కార్డుల జారీపై భారత రాయబార కార్యాలయం విడుదల చేసిన మార్గనిర్దేశకాలను www.ociservices.gov.in చూడొచ్చు.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..