కువైట్:డ్రైవర్ల నియామకంపై నిబంధనలు
- December 07, 2019కువైట్ లో డ్రైవర్ల నియామకంపై ప్రభుత్వం కొత్త నిబంధనలు విధించింది. ఇక నుంచి కుటుంబానికి ఇద్దరు డ్రైవర్లను మాత్రమే అనుమతించనున్నారు. ఈ మేరకు అన్ని డైరెక్టరేట్లలోని డిపార్ట్మెంట్ ఆఫ్ రెసిడెన్స్ అఫైర్స్ శాఖలకు ఆదేశాలు జారీ చేసినట్లు స్థానిక దినపత్రిక అల్-అన్బా తన కథనంలో వెల్లడించింది.
ఒకవేళ మూడవ డ్రైవర్ కావాలని భావించేవారు సంబంధిత అధికారుల నుంచి ప్రత్యేక అనుమతి పొందాల్సి ఉంటుంది. ఇందుకోసం అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ మేజర్-జనరల్ తలాల్ మారాఫియర్, జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెసిడెన్స్ అఫైర్స్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ అబ్దుల్ ఖాదర్ షాబన్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ పొందవలసి ఉంటుంది.
ఆర్టికల్ 20 కింద ఉద్యోగుల సంఖ్యను కుదించటమే లక్ష్యంగా కువైట్ ఈ కొత్త నిబంధనలు రూపొందించింది. అలాగే రోడ్లపై రద్దీ తగ్గుతుందని ఆశిస్తోంది.
తాజా వార్తలు
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్‌లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం