బిహైండ్‌వుడ్స్ గోల్డ్ మెడల్స్: ఉత్తమ నటుడిగా విజయ్ దేవరకొండ
- December 09, 2019
టాలీవుడ్ లో శేకర్ కమ్ముల దర్శకత్వంలో 2012 లో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా లో కూడా చిన్న పాత్ర లో కనిపించాడు విజయ్ దేవరకొండ. ఆ తర్వాత 2015లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నాని హీరోగా నటించిన ఎవడే సుబ్రమణ్యం మూవీలో నటించాడు. ఇక తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో 'పెళ్లిచూపులు' మూవీతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు విజయ్ దేవరకొండ. ఈ మూవీలో ఎంతో నేచురల్ గా తన నటన, హావభావాలు..మాటలతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచాడు. ఈ మూవీతో తన నటనకు విమర్శకుల, ప్రేక్షకుల ప్రశంసలు కూడా అందుకున్నారు విజయ్. ఈ సినిమా ఆయన కెరీర్ లోనే అతి పెద్ద హిట్ గా నిలిచింది.
2017 మొదట్లో ద్వారక అనే సినిమా తో మన ముందుకు వచ్చాడు ఆ సినిమా ఆశించిన అంత విజయాన్ని అందుకోలేదు. ఇక సందీప్ వంగా దర్శకత్వంలో వచ్చిన 'అర్జున్ రెడ్డి' విజయ్ దేవరకొండ స్టామినాను ఎక్కడికో తీసుకు వెళ్లింది. తన నట విశ్వరూపంతో బాక్స్ ఆఫీసు రికార్డ్ సృష్టించాడు. ఆ సినిమా తో పెద్ద స్టార్ గా మారిపోయాడు. దే సంవత్సరం లో వచ్చిన గీత గోవిందం తో మరొక బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. తర్వాత టాక్సీవాలతో మరో ఘన విజయాన్ని అందుకున్నాడు. ఇలా వరుస విజయాలతో టాలీవుడ్, కోలీవుడ్ లో తన సత్తా చాటుతున్నాడు విజయ్ దేవరకొండ.
ఇటీవల విజయ్ దేవరకొండ-రష్మిక మందన జంటగా నటించిన 'డీయర్ కామ్రెడ్' మూవీకి బాక్సాపీస్ వద్ద మిశ్రమ స్పందన వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీలో నటనపరంగా విజయ్‌కు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. తాజాగా ఈ సినిమాకు గాను విజయ్‌దేవరకొండ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు. బిహైండ్‌వుడ్స్ గోల్డ్ మెడల్స్-ఏడో వార్షికోత్సవంలో విజయ్ అవార్డు అందుకున్నాడు. చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమంలో విజయ్‌కు కేజీఎఫ్ ఫేం యశ్ ఉత్తమ నటుడు అవార్డు ప్రదానం చేశాడు. ఈ సందర్భంగా తన సహనటి రష్మిక మందనతో విజయ్ దేవరకొండ ర్యాంప్ వాక్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తాజా వార్తలు
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి
- నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు (బాలల) నిర్వహణ తేదీల మార్పు
- భారత్–న్యూజిలాండ్ మధ్య రేపటి నుంచే FTA అమలు
- ఫ్లైదుబాయ్ విమాన ఘటన పై స్పందించిన భారత పైలట్ స్మిత్ మచ్చర్
- దుబాయ్‌లో ఘనంగా ఐపీఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ బతుకమ్మ సంబరాలు
- ఫ్యూచర్‌సిటీకి కొత్త పోలీస్ కమిషనరేట్.. ప్రారంభించిన సీఎం రేవంత్
- మలేషియాలో ఘనంగా MYTA 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు
- దుబాయ్‌లో నకిలీ అనారోగ్య సెలవు ధ్రువపత్రాల జారీ.. క్లినిక్ క్లర్క్‌కు జైలు శిక్ష
- నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే వీల్ క్లాంప్లు..!!







