కార్డియాక్‌ సెంటర్‌: ఇండియా - బహ్రెయిన్‌ సంబంధాల్లో కొత్త మైలు రాయి

- December 09, 2019 , by Maagulf
కార్డియాక్‌ సెంటర్‌: ఇండియా - బహ్రెయిన్‌ సంబంధాల్లో కొత్త మైలు రాయి

బహ్రెయిన్‌ స్పెషలిస్ట్‌ హాస్పిటల్‌ (బిఎస్‌హెచ్‌) అపోలో హార్ట్‌ సెంటర్‌, మనామాలో నిన్న ప్రారంభమయ్యింది. బహ్రెయిన్‌ - ఇండియా మధ్య సంబంధాల్లో ఇదో కీలకమైన మైలు రాయి అని అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సంగీతా రెడ్డి చెప్పారు. బహ్రెయిన్‌ స్పెషలిస్ట్‌ హాస్పిటల్‌ వద్ద ప్రారంభమైన ఈ కొత్త హార్ట్‌ సెంటర్‌, హృదయ సంబంధ సమస్యలకు మెరుగైన వైద్య చికిత్సలు అందిస్తుంది. హార్ట్‌ కేర్‌ రంగంలో ప్రపంచలోనే అగ్రగామి సంస్థల్లో ఒకటిగా అపోలో కీర్తింపబడ్తోంది. స్టేట్‌ ఆఫ్‌ ఆర్ట్‌ క్యాత్‌ ల్యాబ్‌, కార్డియాక్‌ క్రిటికల్‌ కేర్‌ యూనిట్స్‌, ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ వంటి సౌకర్యాలు ఇక్కడ అందుబాటులో వుంటాయి. బహ్రెయిన్‌ స్పెషలిస్ట్‌ హాస్పిటల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కాసిమ్‌ అర్దాతి మాట్లాడుతూ, ఈ కొత్త హార్ట్‌ సెంటర్‌లో మినిమల్లీ ఇన్వాసివ్‌ ట్రీట్‌మెంట్స్‌ అందుబాటులో వుంటాయని అన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com