దొంగతనం బారిన పడకుండా హెచ్చరిస్తూ వీడియో విడుదల చేసిన షార్జా పోలీసులు
- December 10, 2019షార్జా: వ్యక్తిగత వస్తువులను కారులో వదిలేయడం; ముఖ్యంగా విలువైనవి అనగా హ్యాండ్‌బ్యాగులు, నగదు, మొబైల్ ఫోన్లు లేదా ల్యాప్‌టాప్ లు - మిమ్మల్ని దొంగతనానికి గురి చేస్తాయని పోలీసులు హెచ్చరించారు.
తన సోషల్ మీడియా ఖాతాలలో, షార్జా పోలీసులు అర్ధరాత్రి ఒక సాధారణ దోపిడీ ఎలా జరుగుతుందో పునః సృష్టిస్తూ వీడియోను ప్రచురించారు. “మీ విలువైన వస్తువులు మీ బాధ్యత” అంటూ హెచ్చరిస్తున్నారు. "ఈ ప్రచారం యొక్క లక్ష్యం సమాజ సభ్యులలో వారి ఆస్తులను కాపాడటానికి అప్రమత్తతను పెంచడం" అని పోలీసులు తెలిపారు.
ముఖ్యంగా రాత్రి సమయాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. ఏమర్జెన్సీ సమయాల్లో 999, నాన్ ఏమర్జెన్సీ సమయాల్లో 901 కు కాల్ చేయాలని సూచించారు. అలాగే క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్ మెంట్ -80040, సెంట్రల్ రీజియన్ ఆపరేషన్స్ -8027777-60 కి ఫోన్ చేయాలని పోలీసులు కోరారు.
ఈ విలువైన వస్తువులను ఎప్పుడూ కారులో వదలకండి:
• ఫోన్
• హ్యాండ్‌బ్యాగ్ లేదా వాలెట్
• ల్యాప్‌టాప్ (లేదా దాని బ్యాగ్)
• బ్రీఫ్‌కేస్ లేదా బ్యాక్‌ప్యాక్
• షాపింగ్ బ్యాగులు
• క్యాష్
కారు దొంగతనాలను ఎలా నిరోధించాలి:
• మీ వాహనాన్ని ఎల్లప్పుడూ లాక్ చేయండి
• మీ కారును ON చేసి ఉంచి మీరు పక్కకు వెళ్ళద్దు
• ఆపి ఉంచినప్పుడు, అన్ని కిటికీలను మూసివేయండి
• బాగా వెలుగు ఉన్న ప్రదేశాలలో పార్క్ చేయండి
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్‌లుగా యూఏఈ ల్యాండ్‌మార్క్‌లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్‌లో నిందితుడి అరెస్ట్