బ్యాకాంక్ లో మణిరత్నం మల్టీస్టారర్ షూటింగ్ ప్రారంభం
- December 14, 2019
ప్రముఖ దర్శకుడు మణిరత్నం భారీ మల్టీస్టారర్ కి ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. కల్కి విరచిత పొన్నియిన్ సెల్వన్ నవల ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి 'పొన్నియన్ సెల్వన్' టైటిల్ పెట్టారు. విక్రం, జయంరవి, కార్తి, మోహన్ బాబు, ఐశ్వర్యారాయ్, కీర్తిసురేష్ వంటి భారీ తారాగణంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఇందులో ఐశ్వర్యారాయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారమ్.
తాజగా ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ బ్యాంకాక్ లో మొదలైంది. షూటింగ్ స్పాట్ నుంచి దర్శకుడు మణిరత్నం ఫోటో ఒకటి బయటికొచ్చింది. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానరుపై సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. మణిరత్నం సారథ్యంలోని మెడ్రాస్ టాకీస్ కూడా నిర్మిస్తోంది. కుమరవేల్ తో కలిసి స్క్రీన్ ప్లే సమకూర్చారు మణిరత్నం. మాటలు జయమోహన్ రాశారు. ఏఆర్ రెహ్మాన్ సంగీతం సమకూర్చుతున్నారు.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







