హాకీ ప్లేయర్‌గా హీరోయిన్ లావణ్య త్రిపాఠి

- December 15, 2019 , by Maagulf
హాకీ ప్లేయర్‌గా హీరోయిన్ లావణ్య త్రిపాఠి

హీరోయిన్ లావణ్య త్రిపాఠి సందీప్ కిషన్ `A1 ఎక్స్‌ప్రెస్‌`లో నటిస్తున్నారు. హాకీ నేపథ్యంలో తెరకెక్కే ఈ సినిమాలో సందీప్‌కిషన్‌, లావణ్య త్రిపాఠి ఇద్దరూ హాకీ ప్లేయర్స్‌గా నటిస్తున్నారు. ఇది వరకే సందీప్ కిషన్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఆదివారం లావణ్య త్రిపాఠి పుట్టినరోజు సందర్భంగా ఇప్పుడు ఈ సినిమాలో లావణ్య లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. న్యూ ఏజ్ స్పోర్ట్స్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాను డెన్నిస్ జీవన్ కనుకొలను తెరకెక్కిస్తున్నారు. హిప్ హాప్ తమిళ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. టి.జి.విశ్వప్రసాద్‌, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్‌, దయా పన్నెం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com