ఇండియా:పోస్టాఫీస్‌లో ఖాతాదారులకు శుభవార్త

- December 15, 2019 , by Maagulf
ఇండియా:పోస్టాఫీస్‌లో ఖాతాదారులకు శుభవార్త

భారత కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సుకన్య సమృద్ధి యోజన స్కీం (SSA) సహా పోస్టాఫీస్‌లో వివిధ సేవింగ్ స్కీంలు కలిగి ఉన్న వారికి శుభవార్త. ముఖ్యంగా సుకన్య సమృద్ధి యోజన వంటి స్కీమ్స్‌ను పోస్టాఫీస్‌లో కడుతున్న వారు ఎంతో సంతోషించే వార్తను అందించింది పోస్టల్ డిపార్టుమెంట్. తాజాగా పోస్టాఫీస్ స్కీమ్స్‌కు సంబంధించి కొన్ని నిబంధనలు మార్చింది.

ప్రయోజనకరం
ఈ కొత్త నిబంధనలతో సుకన్య సమృద్ధి అకౌంట్ కలిగి ఉన్నవారికి ప్రయోజనం కలుగుతుంది. అలాగే, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, రికరింగ్ డిపాజిట్ అకౌంట్స్ కలిగి ఉన్నవారికి కూడా లాభం చేకూరుతుంది. కొత్త నిబంధనతో నాన్ హోమ్ పోస్టాఫీస్ బ్రాంచీకి వెళ్లి చెక్ బుక్ ద్వారా డబ్బును చెల్లించవచ్చు. రూ.25,000కు పైన విలువైన చెక్స్‌ను ఇతర పోస్టాఫీస్ బ్రాంచీలకు వెళ్లి కూడా డిపాజిట్ చేసే వెసులుబాటును కల్పించింది.

ఏ బ్రాంచీకైనా వెళ్లి డిపాజిట్ చేయవచ్చు

ఇప్పటి వరకు రూ.25,000కు పైన విలువైన చెక్స్‌ను హోమ్ బ్రాంచీ కాకుండా ఇతర పోస్టాఫీస్ బ్రాంచీలకు వెళ్లి డిపాజిట్ చేసే సౌకర్యం లేదు. విత్ డ్రా చేసుకోవాలని భావిస్తే రూ.25,000 వరకు చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిని సవరించింది. దీంతో పోస్టాఫీస్‌లో సేవింగ్ స్కీమ్స్ కలిగిన వారికి ఇది ఎంతో ప్రయోజనకరం. సుకన్య సమృద్ధి యోజన, రికరింగ్ డిపాజిట్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ సహా ఇతర బ్రాంచీల్లోను అకౌంట్ చెక్ బుక్ ద్వారా డబ్బులు డిపాజిట్ చేవచ్చు. ఇప్పుడు ఏ బ్రాంచీకి వెళ్లైనా డిపాజిట్ చేయవచ్చు.

ఆన్ లైన్ ద్వారా కూడా

సుకన్య సమృద్ధి యోజన, ఆర్డీ, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో డబ్బులు ఆన్ లైన్ ద్వారా కూడా అకౌంట్‌లో డిపాజిట్ చేసుకోవచ్చు. SSAలో దాచుకున్న డబ్బును ఆడపిల్ల 18 ఏళ్లు నిండిన తర్వాత లేదా ఉన్నత చదువుల కోసం లేదా పెళ్లి కోసం సగం తీసుకోవచ్చు. మిగతా మొత్తాన్ని మెచ్యూరిటీ తర్వాత తీసుకోవాలి. ఆన్ లైన్ ద్వారా డబ్బు డిపాజిట్ చేయవచ్చు. ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ ద్వారా ఈ ఫెసిలిటీ పొందవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com