యూఏఈ:ఉద్యోగులకు ఊరట.. ప్రతికూల వాతావరణంలో ఫ్లెక్సిబుల్ గా పనివేళలు

- December 16, 2019 , by Maagulf
యూఏఈ:ఉద్యోగులకు ఊరట.. ప్రతికూల వాతావరణంలో ఫ్లెక్సిబుల్ గా పనివేళలు

యూఏఈలో కురుస్తున్న వర్షాలతో కొద్దిరోజులుగా వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు ఎదురవుతున్నాయి. ఉద్యోగులకు, కార్మికులు తమ విధులకు సమయానికి చేరుకోలేకపోతున్నారు. దీంతో ఉద్యోగులు, కార్మికులకు యూఏఈ మానవవనరుల మంత్రిత్వ శాఖ ఊరట కలిగించే ప్రకటన చేసింది. ప్రతీకూల వాతావరణ పరిస్థితుల్లో ఉద్యోగులకు సౌకర్యవంతంగా పనివేళలు ఉండేలా వేసులుబాటు కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

గత కొద్ది రోజులుగా అబుదాబి, దుబాయ్, షార్జాతో పాటు పలు ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురుస్తోంది. సముద్ర తీర ప్రాంతాల్లో గురువారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని జాతీయ వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రతీకూల పరిస్థితుల నేపథ్యంలో తీర ప్రాంతాల్లో యెల్లో, ఆరెంజ్, రెడ్ అలర్ట్స్ జారీ చేసింది.

ప్రస్తుతం యూఏఈలో నెలకొన్న ప్రతికూల వాతావరణ నేపథ్యంలో 2018లో జారీ చేసిన సర్క్యూలర్ ప్రకారం కార్మికులు, ఉద్యోగుల భద్రతకు యాజమాన్యాలు కట్టుబడి ఉండాలని MoHRE తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో సూచించింది. వర్షాలు, దట్టమైన పొగమంచు ఉన్న సమయాల్లో ఉద్యోగులు, కార్మికులు విధులకు ఆలస్యంగా వచ్చినా వారిని నిర్ణీత సమయానికే వచ్చినట్లు పరిగణలోని తీసుకొవాలని మానవ వనరులు & ఎమిరేటైజేషన్ మంత్రి బిన్ తని అల్ హమ్లీ ఆదేశించారు. వర్షాలు కురిసే సమయాల్లో రోడ్లపై పాటించాల్సిన జాగ్రత్తల పట్ల అవగాహన పెంపొందించటంతో పాటు వారికి సౌకర్యవంతంగా పనివేళలు ఉండాలని వెసులుబాటు కల్పించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com