సెన్సార్ పూర్తి చేసుకున్న 'రూలర్'
- December 16, 2019
టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న 'రూలర్' మూవీకి సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. 'జై సింహా' తర్వాత కే.యస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్‌కు ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ఈ మూవీలో బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. ట్రైలర్ లో చూపించిన విధంగా పోలీస్ ఆఫీసర్, మాఫియా డాన్ గా కనిపించబోతున్నట్లు ఫిలిమ్ వర్గాల్లో టాక్. ఇక ట్రైలర్ లో బాలయ్య చేస్తున్న బీభత్సం అంతా ఇంతా కాదు. ఎమోషన్, సెంటిమెంట్ తో పాటు యాక్షన్ ఇరగదీశారు. కె.ఎస్.రవికుమార్ ఈ మూవీ తెరకెక్కించగా సి.కల్యాణ్ నిర్మిస్తున్నారు.చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు.
ఈ మూవీలో బాలయ్య సరసన వేదిక, సోనాల్ చౌహాన్ నటిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రావ్వడానికి సన్నధం అవుతుంది. రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్స్ ను కూడా వేగవంతం చేస్తోంది. క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన 'ఎన్టీఆర్ బయోపిక్' పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.. కానీ బాక్సాఫీస్ వద్ద నిరాశే మిగిలింది. దాంతో ఈసారి ప్రేక్షకుల ముందుకు సరికొత్తగా రావాలనుకుంటున్న బాలయ్య లుక్ పరంగా కూడా చాలా వేరియేషన్స్ చూపిస్తున్నారు.
ఈ మూవీ నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్, టీజర్‌కు విశేష స్పందన లభించింది. ఈ మూవీలోని బాలయ్య స్టిల్స్, గెటప్స్ ఆకట్టుకున్నాయి. ప్రకాశ్ రాజ్, జయసుధ, భూమిక చావ్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. చిరంతన్ భట్ సంగీతం అందిస్తోన్న ఈ మూవీకి సి.రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. హ్యాపీ మూవీస్ బ్యానర్ పై సి.కల్యాణ్ ఈ మూవీ నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







