విజయ్ దేవరకొండ తో రొమాన్స్‌కు జాన్వీ సై..
- December 16, 2019
యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండకు తెలుగులోనే కాదు.. బాలీవుడ్‌లో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. బీ-టౌన్ హీరోయిన్లు అలియా భట్, జాన్వీ కపూర్, కియారా అద్వానీలకు రౌడీ మీద బిగ్ క్రష్ ఉందని చెప్పాలి. ఇక ప్రస్తుతం విజయ్ తన తదుపరి చిత్రం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్‌తో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ప్యాన్ ఇండియా మూవీగా పూరి తెరకెక్కించనున్నాడు. దానికి అనుగుణంగానే బాలీవుడ్ వెర్షన్‌కు నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ ప్రజెంట్ చేసేందుకు సిద్దమయ్యాడు.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ భామను ఎంపిక చేయాలని చిత్ర యూనిట్ మొదటి నుంచి ప్రయత్నం చేస్తూ వచ్చారు. కియారా అద్వానీ, అనన్య పాండే వంటి స్టార్ హీరోయిన్లతో సంప్రదింపులు జరిపారు కూడా. అయితే డేట్స్ ఎడ్జెస్ట్ కాకపోవడం వల్ల అందరూ కూడా నో చెప్పడం జరిగింది.
ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్ ఎంపిక అయినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ సినిమాను జాన్వీ సైన్ చేయడానికి పరోక్షంగా కరణ్ జోహార్ కారణమని బీ-టౌన్ కోడై కూస్తోంది. స్టార్ డాటర్స్ అందరికి కరణ్ జోహార్ ఒక గాడ్ ఫాదర్ లెక్క. జాన్వీ విషయానికి వస్తే.. ఆమె మొదటి సినిమానే కాదు.. తాజాగా నటిస్తున్న సినిమాల్లో ఎంపికలో కూడా కరణ్ జోహార్ ప్రమేయం ఉంది.
అంతేకాకుండా గతంలో జాన్వీ 'కాఫీ విత్ కరణ్' షోకి వచ్చినప్పుడు విజయ్ మీద ఉన్న క్రష్‌ను బయటపెట్టింది. ఇలా ఈ రెండు కారణాల చేత జాన్వీ.. విజయ్ సినిమాకు ఓకే చెప్పి ఉండొచ్చని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







