ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కొన్ని విషయాలు...

- December 18, 2019 , by Maagulf
ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కొన్ని విషయాలు...

కువైట్:18 డిసెంబర్ 2019 నేడు ఇంటర్నేషనల్ వలసదారుల దినోత్సవం.ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ 100 ఏళ్ల క్రితం 1919 లో స్థాపించబడింది.అప్పటి నుండి నిర్విరామంగా 187 దేశాల ప్రభుత్వాలను, యజమానులను కార్మికులను త్రైపాక్షికంగా భాగస్వామ్యం చేస్తూ, బడ్జెట్ తో కూడిన కార్యక్రమాలను రూపొందించారు.

పనివద్ద హక్కులను ప్రోత్సహించడం,మంచి ఉపాధి అవకాశాలను ప్రోత్సహించడం సామాజిక రక్షణ మెరుగుపరచడం మరియు పనికి సంబంధించిన సమస్యలపై మాట్లాడడాన్ని బలోపేతం చేయడం ముఖ్య లక్ష్యాలుగా  పనిచేస్తుంది.

మన దేశ,రాష్ట్ర వలసదారుల గురించి మన ప్రభుత్వాలు ఇంకా కొంచెం మెరుగైన కార్యక్రమాలను చేపట్టాలని ఆశిద్దాం.కేంద్రంలో బడ్జెట్ తో కూడిన ప్రవాసి బిల్లు,
రాష్ట్రంలో NRI పాలసీ అతి త్వరలో ఏర్పడితే బాగుంటుందని మురళీధర్ రెడ్డి గంగుల అభిప్రాయపడ్డారు.

27 జూలై 2016 న తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ వలసదారుల కొరకు కేరళ,పంజాబ్ కంటే అత్యుత్తమమైన ఎన్ఆ.ర్.ఐ పాలసీ రూప కల్పన చేస్తామని వాగ్దానం చేశారు.
పునరావాసానికి కార్పస్ ఫండ్ కూడా పెట్టడానికి నిర్ణయించారు.13మే 2017 న విదేశీ సంపర్క్ కార్యక్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో వలసదారులకు మంచి చేస్తామని వాగ్దానం చేశారు.సీఎం కేసీఆర్ కూడా దృష్టి పెట్టారు,త్వరలో కథ సుఖాంతం అవుతుందని ఆశిద్దాం.ఈ పరిణామాల వల్ల  మిస్సింగ్ , తప్పుడు విసా, తప్పుడు కేసుల కు ప్రభుత్వ సహకారం ఉంటుంది.
 
ఆరోగ్యం,మెరుగైన నైపుణ్యత, మంచి ఉద్యోగాలు బాధిత కుటుంబాలకు ఎక్స్ గ్రెసియా  వస్తుంది.ప్రపంచవ్యాప్తంగా 270 మిలియన్ వలసదారులు ఉన్నారు అందులో అత్యధికంగా యురోపియన్ యూనియన్ లో 82 మిలియన్లు, ఉత్తర అమెరికా లో 59 మిలియన్లు, ఉత్తర ఆఫ్రికా పశ్చిమాసియాలో 49 మిలియన్లు, అమెరికాలో 51 మిలియన్లు, జర్మనీ మరియు సౌత్ ఆఫ్రికాలో 13 మిలియన్, యునైటెడ్ కింగ్డమ్ ఫ్రాన్స్ కెనడా ఆస్ట్రేలియా లో 8 మిలియన్  ఒక్కొక్కటి గా ఉన్నారు.ఇటలీ లో 6 మిలియన్ల వరకు ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com