మహేష్ కోసం మెగాస్టార్

- December 20, 2019 , by Maagulf
మహేష్ కోసం మెగాస్టార్

సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 5న హైదరాబాద్‌లో జరగనుంది. ఇక ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఎల్బీ స్టేడియంలో జరగబోతున్న ఈ కార్యక్రమానికి మెగాస్టార్ రాబోతున్నారని.. మెగా సూపర్‌ ఈవెంట్‌ కోసం సిద్ధంగా ఉండండి అని మూవీ యూనిట్ తెలిపింది. ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియోలో ”మీరు మెగా ఈవెంట్లను చూసి ఉండొచ్చు. సూపర్ ఈవెంట్లు చూసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు చరిత్ర సృష్టించబోతున్నాం. సూపర్‌స్టార్ హోస్ట్ చేయబోతున్న ఈవెంట్‌కు మెగాస్టార్ అతిథిగా రాబోతున్నారు. మెగా సూపర్ ఈవెంట్‌కు సిద్ధమవ్వండి” అని సరిలేరు నీకెవ్వరు టీమ్ తెలిపింది. దీంతో ఇరు హీరోల ఫ్యాన్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే మహేష్ సినిమా ఈవెంట్‌ కోసం చిరంజీవి రావడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

కాగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సరిలేరు నీకెవ్వరు తెరకెక్కింది. ఈ మూవీలో మహేష్ బాబు ఆర్మీ మేజర్ పాత్రలో నటించగా.. ఆయనతో రష్మిక రొమాన్స్ చేసింది. విజయశాాంతి, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, సంగీత, బండ్ల గణేష్, వెన్నెల కిశోర్, సుబ్బరాజు, హరితేజ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. క్రేజీ కాంబోగా తెరకెక్కిన ఈ మూవీపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు భరత్ అనే నేను, మహర్షి సినిమాలతో రెండు వరుస విజయాలను దక్కించుకున్న మహేష్ బాబు.. ఈ మూవీతో హ్యాట్రిక్ సొంతం చేసుకోవాలని భావిస్తున్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com