ఆస్ట్రేలియా మిలియనీర్ సూపర్ జాబ్ ఆఫర్; పర్సనల్ ఫోటోగ్రాఫర్ కు ఏడాదికి dh2,00,000 జీతం
- December 20, 2019
ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్లకు ఓ అస్ట్రేలియన్ మిలియనీర్ బంపర్ ఆఫర్ ప్రకటించాడు. తనకు పర్సనల్ ఫోటో గ్రాఫర్ కావాలంటూ ఓ ప్రకటన విడుదల చేశాడు. శాలరీ ఎంతో తెలుసా? ఏడాదికి 2,00,000 దిర్హామ్ లు. చేయాల్సిందల్లా ఆ మిలియనీర్ తో పాటు ఫారెన్ టూర్స్ కి వెళ్లి అతని ఫోటోలను తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయటమే.
ఆస్ట్రేలియాకు చెందిన ఆ మిలియనీర్ పేరు మాథ్యూ లెప్రె. అతని వయస్సు జస్ట్ 26 ఏళ్లే. ఈ-కామర్స్ దిగ్గజంగా పేరొందిన మాథ్యూ గతంలో కూడా ఇలాంటి సంచలన ప్రకటన చేశాడు. తనకు పర్సనల్ అసిస్టెంట్ కావాలని, జీతం 1,91,000 దిర్హామ్ లు ఇస్తానని ఈ ఏడాది మార్చిలో ప్రకటించాడు. ఇక పర్సనల్ ఫోటో గ్రాఫర్ కావాలంటూ భారీ శాలరీతో మళ్లీ ఇప్పుడు జాబ్ ఆఫర్ ఇస్తున్నాడతను. తనతో పాటు యూరప్, యూఎస్ఏ ప్రయాణించి ఫోటోలు తీయాల్సి ఉంటుంది. ఇంతకీ ఈ ఈ-కామర్స్ మిలియనీర్ సంపాదన ఎంతో తెలుసా? నెలకు 4,44. 770 దిర్హామ్ లు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







