భారతీయ వైద్యుల కోసం బ్రిటన్ కొత్త పథకం
- December 20, 2019
ప్రభుత్వ నిధులతో పనిచేసే నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్హెచ్ఎస్) లో శ్రామిక శక్తి కొరతను తీర్చడానికి భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల నుండి అర్హత కలిగిన వైద్యులు, నర్సుల కోసం కొత్త వీసాను ప్రవేశపెట్టే ప్రణాళికలను యూకే ప్రభుత్వం గురువారం ధృవీకరించింది. ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ఎన్నికల ప్రచార బాటలో 'ఎన్హెచ్ఎస్ వీసా' గురించి సూచనలు చేశారు, ఇది గురువారం పార్లమెంటులో క్వీన్స్ ప్రసంగంలో భాగంగా నిర్ధారించబడింది. 'నేషనల్ హెల్త్ సర్వీస్ యొక్క శ్రామిక శక్తిని పెంచడానికి చర్యలు తీసుకోబడతాయి. అర్హతగల వైద్యులు, నర్సులు, ఆరోగ్య నిపుణులు కొత్త వీసా తో యునైటెడ్ కింగ్‌డమ్‌లోకి ప్రవేశిస్తారు' అని ఆమె ప్రసంగం యొక్క సారాంశం.
ప్రపంచవ్యాప్తంగా తెలిమైన, ప్రతిభగల వారిని ఆకర్షించడానికి ఆస్ట్రేలియన్ తరహా పాయింట్ల-ఆధారిత ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను యూకే ప్రవేశపెట్టనుంది. ప్రభుత్వ 'ఎన్హెచ్ఎస్ పీపుల్ ప్లాన్' క్రింద అర్హతగల వైద్యులు, నర్సులు, అనుబంధ ఆరోగ్య నిపుణులు ఉద్యోగ ప్రతిపాదనతో గుర్తింపు పొందిన ప్రమాణాలకు అర్హత ఉన్న వారికి యూకే రావడానికి ఫాస్ట్ ట్రాక్ వీసా ఇవ్వబడుతుంది. వచ్చే ఏడాది బ్రిటన్ యూరోపియన్ యూనియన్ (ఇయు) ను వీడనుంది. బ్రెక్సిట్ అనంతర కొత్త వీసా, ఇమ్మిగ్రేషన్ విధానం సరళంగా ఉంటుందని బ్రిటిష్ ప్రభుత్వం పేర్కొంది. యూరోపియన్ యూనియన్ యొక్క నిబంధనలు ఇకపై యూకేకి వర్తించవు.
తాజా వార్తలు
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త
- హైదరాబాద్ కి భారీ వర్షాల హెచ్చరిక..
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్‌ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!







