దుబాయ్:నగ్నంగా న్యూసెన్స్ చేసి పోలీసులపై దాడికి పాల్పడిన ఎమిరాతికి జైలు శిక్ష

- December 21, 2019 , by Maagulf
దుబాయ్:నగ్నంగా న్యూసెన్స్ చేసి పోలీసులపై దాడికి పాల్పడిన ఎమిరాతికి జైలు శిక్ష

దుబాయ్ లో ఓ మహిళ ఇంట్లోకి చొరబడి నగ్నంగా న్యూసెన్స్ చేయటమే కాకుండా..పోలీసులపై దాడికి పాల్పడిన వ్యక్తికి జైలు శిక్ష పడింది. గత ఆగస్టులో ఫైల్ అయిన ఈ కేసులో విచారణ జరిపిన కోర్టు నిందితుడికి మూడు నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. గత ఆగస్టులో బుర్ దుబాయ్ లోని అరబ్ మహిళ ఇంట్లోకి చొరబడిన 21 ఏళ్ల వ్యక్తి నగ్నంగా రభస చేశాడు. మళ్లీ బయటికి వెళ్లి ఆ తర్వాత మళ్లీ ఇంట్లోకి వస్తూ ఇలా రిపీటెడ్ గా న్యూసెన్స్ క్రియేట్ చేశాడు. అతని వెకిలి చేష్టలతో భయపడిపోయిన ఆ బాధితురాలు తొలుత పోలీస్ రిపోర్ట్ చేయటానికి సాహసించలేదు. అయితే..అతను పదే పదే ఇంట్లోకి వచ్చి వెళ్తుండటంతో చివరికి పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే స్పాట్ కు చేరుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. కానీ, నిందితుడు దాడి చేసి ఇద్దరు పోలీసులను గాయపరిచినట్లు కోర్టుకు విన్నవించారు. ఇంజ్యూరీస్ డిటేల్స్ ని కోర్టుకు  సమర్పించారు. నిందితుడు కూడా తనపై అభియోగాలను అంగీకరించటంతో కోర్టు అతనికి మూడు నెలల జైలు శిక్ష విధించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com