అబుధాబి విజిటర్స్ ఇక నుంచి ఎమిరాతి ఐకానిక్ మసీదులను సందర్శించే అవకాశం

- December 21, 2019 , by Maagulf
అబుధాబి విజిటర్స్ ఇక నుంచి ఎమిరాతి ఐకానిక్ మసీదులను సందర్శించే అవకాశం

అబుధాబి: ఇస్లామిక్ హిస్టరీ, కల్చర్, ఆర్టిటెక్చర్ విలువల్ని చాటిచెప్పటమే లక్ష్యంగా డిపార్చర్ ఆఫ్ కల్చర్ టూరిజం జనరల్ అథారిటీ ఫర్ ఇస్లామిక్ అండ్ ఎండోమెంట్స్ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి అబుధాబి విజిటర్స్ కు ఎమిరాతి కంట్రీస్ లోని ఐదు హిస్టారిక్ మసీదులను కూడా సందర్శించే అవకాశం కల్పించింది.  ఈ కార్యక్రమం లాంచింగ్ లో జనరల్ అథారిటీ ఫర్ ఇస్లామిక్ అండ్ ఎండోమెంట్స్ తో పాటు ఎమిరాతిలోని పలు చర్చీల ఫాదర్లు కూడా పాల్గొని ఇయర్ ఆఫ్ టోలరెన్స్ స్ఫూర్తిని చాటారు.

విజిటర్లు సందర్శించే ఆ ఐదు హిస్టారిక్ మసీదులు ఇవే : 1) షేక్ సుల్తాన్ బిన్ జయెద్ మసీదు, 2) అల్ మెరీనాలోని అల్ కరీం మసీదు, 3) రీమ్ ద్వీపంలోని అల్ అజీజ్ మసీదు, 4) షేక్ జయెద్ బిన్ సుల్తాన్ అల్ ఖలీదియాలోని రెండవ మసీదు, 5) అల్ ముష్రిఫ్‌లోని మరియం, ఉమ్ ఈసా మసీదు.

ఈ ఐదు సిగ్నిఫెంట్ మసీదుల సందర్శించే పర్యాటకులకు మసీదుల చరిత్రతో పాటు..ఇస్లాం సోసైటీలో మసీదుల పాత్ర ప్రధాన్యతను వివరించనున్నట్లు అబుదాబి టూరిజం అండ్ కల్చర్ డైరెక్టర్ అలి హసన్ అల్ షైబా తెలిపారు. తమ పూర్వీకులు నిర్మించిన ఈ చారిత్రాత్మక మసీుదుల్లో ఎమరాతీల జీవనచిత్రం కనిపిస్తుందని, అబుధాబి వాస్తవికతను తెలుపుతాయని వివరించారు. తమ సహనాన్ని, శాంతియుత జీవనాన్ని మసీదులు ప్రతిబింబిస్తాయని తెలిపారు. అయితే..ఈ స్పిరిట్చ్యూవల్ టూర్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందో అధికారులు ప్రకటించాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com