నా జీవితంలో ఇది మరిచిపోలేని రోజు : సీఎం వైఎస్ జగన్
- December 23, 2019
కడప: జిల్లాలోని సున్నపురాళ్లపల్లెలో స్టీల్‌ప్లాంట్‌కు సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన చేశామన్నారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు చంద్రబాబు స్టీల్‌ప్లాంట్‌కు టెంకాయ కొట్టడం మోసం కాదా? అని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. గత ప్రభుత్వానికి.. ఈ ప్రభుత్వానికి పాలనలో తేడాకు ఇదే నిదర్శనమని జగన్ అన్నారు. ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని.. తన జీవితంలో ఇది మరిచిపోలేని రోజని జగన్ వ్యాఖ్యానించారు. జిల్లాకు స్టీల్ ఫ్యాక్టరీ రావాలని ఎన్నో సంవత్సరాలుగా కలలు కన్నామని.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో ముందడుగులు పడ్డాయని జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
బతుకులు మారిపోతాయ్ : రూ.15వేల కోట్లతో స్టీల్‌ప్లాంట్ నిర్మిస్తున్నట్లు ఆయన సభావేదికగా ప్రకటించారు. మూడేళ్లలో స్టీల్‌ప్లాంట్ నిర్మాణం పూర్తి చేస్తామని ఈ సందర్భంగా జగన్ స్పష్టం చేశారు. 30లక్షల టన్నుల సామర్థ్యంతో స్టీల్ ప్లాంట్ నిర్మించబోతున్నట్లు జగన్ తెలిపారు. స్టీల్‌ప్లాంట్‌కు అవసరమైన ఐరన్ వోర్ కోసం ఎన్ఎండీసీతో ఒప్పందం చేసుకున్నామన్నారు. స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుతో నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని సీఎం తెలిపారు. ఉక్కు పరిశ్రమతో జిల్లా వాసుల బతుకులు మారిపోతాయని ఆయన చెప్పుకొచ్చారు.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్‌ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







