దుబాయ్ లో చిక్కుకున్న మావాళ్లను రప్పించండి
- December 23, 2019
తెలంగాణ:జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రంగధామునిపల్లి గ్రామానికి చెందిన నలువాల పోషయ్య, జెల్ల మల్లయ్య అనే ఇద్దరు వలస కార్మికులు యూ.ఏ.ఈ దేశంలోని దుబాయ్ లో చిక్కుకున్నారని వారిని స్వదేశానికి రప్పించాలని వారి కుమారులు సోమవారం (23.12.2019)న జగిత్యాల జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు.
ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ నాయకులు సయిండ్ల రాజిరెడ్డి, మ్యాడవరం నాగభూషణం లతో కలిసి బాధిత కుటుంబ సభ్యులు జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు.
దుబాయ్ కి అక్రమంగా దేశ సరిహద్దు దాటడం వలన స్వదేశం రావడానికి ఇబ్బందిగా ఉన్నదని,దుబాయ్ లోని భారత రాయబార కార్యాలయం వారు తాత్కాలిక పాస్ పోర్టులు జారీ చేయాలని వారు కోరారు.

తాజా వార్తలు
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త
- హైదరాబాద్ కి భారీ వర్షాల హెచ్చరిక..
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్‌ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!







