ఎనర్జిటిక్ స్టార్ రామ్ చేతికి అసలు గన్ ఇస్తే...
- December 23, 2019
వెండితెర మీద డమ్మీ గన్ లతో ప్రత్యర్థుల మీదికి విరుచుకుపడే హీరోకి అసలైన గన్ లు చేతికి వస్తే ఎలా ఉంటుంది. అలాంటి అవకాశం మన ఇస్మార్ట్ శంకర్, టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేనికి వచ్చింది. రక్షణ దళాలు, పారామిలిటరీ దళాలు, వివిధ పోలీసు శాఖలకు గత 25 ఏళ్లుగా తుపాకులు, ఏకే 47 లాంటి ఆయుధాలను రూపొందించి సరఫరా చేసే జెన్ టెక్నాలజీస్ సంస్థ హైదరాబాద్ లో నిర్వహించిన రజతోత్సవ కార్యక్రమానికి రామ్ ని ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. అలాంటి అవకాశం వస్తే ఈ ఎనర్జిటిక్ స్టార్ ఎలా ఊరుకుంటారు. గన్ చేతికి తీసుకుని ఎలా కాలిస్తే టార్గెట్ రీచ్ అవుతుందో తెలుసుకున్నారు. తన సినిమాలకు బాగా పనికి వస్తుందనుకుని ఆయుధాలకు సంబంధించిన సమాచారమంతా అడిగిమరీ తెలుసుకున్నారు. ఎంఎంజీ, ఏజీఎల్, ఏటీజీఎమ్, సీటీఎస్ఆర్, ఏకే 47... ఇలా అన్ని రకాల ఆయుధాల సమాచారం
తెలుసుకోవడమే కాకుండా , చేతుల్లోకి తీసుకుని ప్రయోగాలు కూడా మొదలు పెట్టేశారు. షూటింగ్ రేంజ్ ఎలా ఉంటుందో ప్రత్యక్ష ప్రయోగం కూడా చేశారు. ఈ అనుభవం గురించి రామ్ మాట్లాడుతూ ‘అరుదైన అనుభవమిది... సినిమా లాగా లేదు . చాలా కొత్తగానూ, థ్రిల్లింగ్ గానూ ఉంది. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ఈ సంస్థవారికి థాంక్స్ చెప్పాలి’అన్నారు. ఈ సంస్థ ఎండీ, ఛైర్మన్ అశోక్ అట్లూరి ఈ సందర్భంగా రామ్ ను జ్ఞాపికతో సత్కరించారు. సంస్థ ప్రెసిడెంట్ కిషోర్ దత్ అట్లూరి, బిజినెస్ హెడ్ రవికుమార్ చెన్నా తదితరులు తమ కార్యక్రమానికి హాజరైనందుకు రామ్ కు కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి
- నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు (బాలల) నిర్వహణ తేదీల మార్పు
- భారత్–న్యూజిలాండ్ మధ్య రేపటి నుంచే FTA అమలు
- ఫ్లైదుబాయ్ విమాన ఘటన పై స్పందించిన భారత పైలట్ స్మిత్ మచ్చర్
- దుబాయ్‌లో ఘనంగా ఐపీఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ బతుకమ్మ సంబరాలు
- ఫ్యూచర్‌సిటీకి కొత్త పోలీస్ కమిషనరేట్.. ప్రారంభించిన సీఎం రేవంత్
- మలేషియాలో ఘనంగా MYTA 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు
- దుబాయ్‌లో నకిలీ అనారోగ్య సెలవు ధ్రువపత్రాల జారీ.. క్లినిక్ క్లర్క్‌కు జైలు శిక్ష
- నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే వీల్ క్లాంప్లు..!!







