26న సూర్యగ్రహణం.. బెజవాడ దుర్గగుడి మూసివేత
- December 23, 2019
విజయవాడ: కేతుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం సందర్భంగా ఈనెల 26న ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయాన్ని మూసివేయనున్నారు. వచ్చే గురువారం బహుళ అమావాస్య ఉదయం 8.11 నుంచి 11.20 గంటల వరకు గ్రహణ మోక్షకాలం ఉంటుందని దుర్గగుడి వైదిక కమిటీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. గ్రహణం వీడిన తర్వాత సాయంత్రం 4 గంటలకు అమ్మవారికి స్నపనాభిషేకం చేసి భక్తులను దర్శనానికి అనుమతించనున్నట్టు పేర్కొంది. కాగా, భవానీ దీక్షల విరమణ ఉత్సవాల సందర్భంగా ఈనెల 18 నుంచి 26వ తేదీ వరకు నిలిపివేసిన అన్ని ఆర్జిత సేవలను 27వ తేదీ నుంచి పునరుద్ధరిస్తామని తెలియజేసింది.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్‌ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







