మస్కట్:తగ్గనున్న చెక్ ఇన్ లగేజీ ఛార్జీల భారం..వలసదారులకు ఊరట
- December 23, 2019
ఓమన్ నుంచి స్వదేశాలకు వెళ్లే వలసదారులకు ఇక నుంచి లగేజీ ఛార్జీల భారం తగ్గనుంది. మస్కట్ నుంచి ఇండియా, ఇండోనేషియా, ఫిలిపిన్స్, పాకిస్తాన్, శ్రీలంక, ఈజీప్ట్ వెళ్లే వలసదారులు 40 కేజీల వరకు చెక్ ఇన్ లగేజీని ఫ్రీగా తీసుకెళ్లవచ్చు. అయితే..బ్యాగులు మాత్రం రెండు కన్న ఎక్కువ ఉండకూడదని ఓమన్ ఎయిర్ లైన్స్ కండీషన్ పెట్టింది. వచ్చే మార్చి 31లోపు ప్రయాణించే వారికి మాత్రమే ఈ వెసులుబాటు వర్తిస్తుంది. వలసదారుల దేశాలను బట్టి కూడా టైం పీరియడ్ లో మార్పులు ఉన్నాయి. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, జైపూర్, గోవా, బెంగళూరు, కొచ్చి, తిరువనంతపురం, చెన్నైతో పాటు మనీలా, జకార్తా వెళ్లే వారికి జనవరి 10 - మార్చి 31 వరకు 40 కేజీల చెక్ ఇన్ లగేజీని అనుమతిస్తారు. కరాచీ, లాహోర్, కొలంబో, కైరోకి వెళ్లే వారికి మాత్రం ఈ నెల 19 నుంచే ఎక్స్ ట్రా లగేజీ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. మార్చి 31 వరకు 40 కేజీల లగేజీని తీసుకెళ్ల అవకాశం ఉంది. ఈ అఫర్ తో స్వదేశాలకు వెళ్లే వలసదారులు ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ కోసం కానుకలు తీసుకుళ్లే అవకాశం దక్కింది.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







