యూఏఈ: ఇక నుంచి టెలికం కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకున్నా నో ప్రాబ్లమ్
- December 25, 2019
కొత్త ఏడాదిలో టెలికం కస్టమర్లకు యూఏఈ టెలికమ్యూనేషన్స్ రెగ్యూలెటరీ అథారిటీ గుడ్ న్యూస్ అందించింది. ఇక నుంచి టెలికం కాంట్రాక్ట్ ను రద్దు చేసుకున్నా ఏడాది మొత్తానికి ఫీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఈ మేరకు కొత్త నిబంధన జనవరి 1 నుంచి అమల్లోకి రాబోతున్నట్లు Etisalat, du వినియెగదారులకు TRA గుర్తుచేసింది. ఈ కొత్త రెగ్యూలేషన్ ప్రకారం ఇక నుంచి టెలికం కాంట్రాక్ట్ రద్దు చేసుకుంటే ఈ ఒక్క నెల వరకు ఫీ చెల్లిస్తే సరిపోతుంది. గతంలో ఉన్న నిబంధనలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. టెలికం వినియోగదారుడు ఏ కారణంతోనైనా సరే కాంట్రాక్ట్ రద్దు చేసుకుంటే కాంట్రాక్ట్ కాలానికి చెల్లించాల్సిన మొత్తం డబ్బు చెల్లించాల్సి వచ్చేది. కొన్ని కాంట్రాక్ట్ లలో ఏడాది ఫీజు చెల్లించాల్సి వచ్చేది. దీనికితోడు కాంట్రాక్ ను మధ్యలోనే రద్దు చేసుకున్నందుకు ఫైన్లు కూడా ఉండేవి. ఇక నుంచి కాంట్రాక్ట్ రద్దు చేసుకున్న ఆ నెల ఫీజు చెల్లిస్తే సరిపోతుంది.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







