యూఏఈ:ఉల్లంఘనలకు పాల్పడుతున్న స్టోర్ మూసివేత
- December 27, 2019
యూఏఈలోని ఓ ఫుడ్ ఎస్టాబ్లిష్‌మెంట్ పదే పదే ఉల్లంఘనలకు పాల్పడుతున్న దరిమిలా, దాన్ని మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది అధికార యంత్రాంగం. అబుదాబీ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ, బకాలా టాప్ సేవ్ మోర్ ఎల్‌ఎల్‌సి స్టోర్‌ని హెల్త్ సంబంధిత ఉల్లంఘనల నేపథ్యంలో మూసివేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. స్టోర్‌లో హైజీన్ కండిషన్స్‌ని మెరుగుపర్చేదాకా మూసివేస్తున్నట్లు వెల్లడించింది అధికార యంత్రాంగం. పెద్దయెత్తున ఫ్రోజెన్ ప్రోడక్ట్స్‌ని ఫ్రీజర్స్ మరియు రిప్రిజిరేటర్స్‌లో సదరు స్టోర్ నిల్వ చేస్తోంది.. అదీ అపరిశుభ్ర వాతావరనంలో. లైసెన్స్‌ని సైతం సదరు స్టోర్ రెన్యువల్ చేయించుకోలేదు. జూన్, సెప్టెంబర్, అక్టోబర్ మరియు డిసెంబర్‌లలో ఈ స్టోర్‌కి హెచ్చరికలు జారీ చేసినా నిర్వహకులు పట్టించుకోలేదు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







