2020లో డేట్ రాసేటప్పుడు.. జాగ్రత్త
- December 27, 2019
ఇంకో నాలుగు రోజుల్లో 2020 వస్తోంది. విజన్ 2020, లీడ్ ఇండియా 2020.. గత రెండు దశాబ్దాలుగా.. ఈ మాటలు వినని తెలుగోడు, భారతీయుడు ఉండడనడంలో అతిశయోక్తి లేదు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మాటల్లో కానీ... ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటల్లో కానీ.. ఈ పదాలు ఎక్కువగా వినపడేవి. వ్యక్తిగత, సామాజిక అభివృద్ధి నేపథ్యంలో ఈ నినాదాలు ముందుకు వచ్చాయన్న విషయం తెలిసిందే. ఎంతో మంది ఉత్సాహంగా ఎదురు చూస్తున్న.. 2020పై ఓ ఆసక్తికర వార్త...వాట్సాప్‌లలో విపరీతంగా షేర్ అవుతోంది. కొత్త సంవత్సరంలో తేదీ రాసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలనేది దాని సారాంశం.
వివరాల్లోకి వెళితే.. జనవరి నుంచి తేదీలు 01/01/2020గా ప్రారంభమవుతాయన్న విషయం తెలిసిందే. అయితే చాలా మంది అలవాటుగా 01/01/20 అని రాసే అవకాశం ఉంటుంది. దీనివల్ల అది 01/01/2000 నుంచి 01/01/2099 వరకు ఏదైనా మార్చుకునే అవకాశం ఉంటుంది. ఇది ఒప్పందాల విషయంలో.. ఇతర కాంట్రాక్టుల విషయంలో.. చెక్‌ల విషయంలో జరగడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. దీనివల్ల మోసపోయే ఛాన్సులు చాలా ఉన్నాయని ఆ మెసేజ్ తెలుపుతోంది. డేట్ రాసేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలని చెబుతోంది. ఈ ఏడాదంతా ఆ విషయాన్ని గర్తుంచుకోవాలని సదరు వాట్సాప్ మెసేజ్ హెచ్చరిస్తోంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష