CAA ఎఫెక్ట్‌: ఇండియన్స్‌ని అరెస్ట్ చేయలేదని దుబాయ్‌ క్లారిటీ

- December 27, 2019 , by Maagulf
CAA ఎఫెక్ట్‌: ఇండియన్స్‌ని అరెస్ట్ చేయలేదని దుబాయ్‌ క్లారిటీ

దుబాయ్‌:సిటిజన్‌ అమెడ్మెంట్ బిల్లు-CAAకి వ్యతిరేకంగా స్లోగన్స్‌ చేశారనే ఆరోపణలపై తాము ఎవరినీ అరెస్ట్ చేయలేదని యూఏఈ ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. నైఫ్‌ ప్రాంతంలో నినాదాలు చేసిన ఇండియన్స్‌ ని అదుపులోకి తీసుకున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చింది. అసలు ఏ ఇండియన్‌ ఆర్గనైజనేషన్ ప్లాన్ చేసుకొని ముందస్తు వ్యూహంతో సమావేశం కాలేదని... అటుగా వెళ్తున్న కొందరు వ్యక్తులు అనుకోకుండా కొద్ది నిమిషాల పాటు గుమికూడారని వివరించింది. కానీ, వార్నింగ్ ఇవటంతో వాళ్లంతా క్షణాల్లోనే అక్కడి నుంచి వెళ్లిపోయారని తెలిపింది. అంతేకాదు.. తాము ఇతర దేశాలకు సంబంధించి అంర్గత వ్యవహారాల్లో తలదూర్చబోమని..యూఏఈ స్పష్టం చేసింది. ఆయ దేశాల పరిస్థితులకు అనుకూలంగా అక్కడి ప్రభుత్వాలు తీసుకునే విధాన పరమైన నిర్ణయాల్లోనూ కల్పించుకునే ప్రసక్తే లేదేని తేల్చిచెప్పింది.

సిటిజన్‌ అమెడ్మెంట్ బిల్లు-CAAకి వ్యతిరేకంగా నైఫా ప్రాంతంలో కొందరు ఇండియన్స్‌ స్లోగన్స్‌ చేసినట్టున్న వీడియో ప్రస్తుతం వైరల్‌ గా మారిన విషయం తెలిసింది. ఇదే కేసులో నినాదాలు చేసిన వారిని అరెస్ట్ చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే శుక్రవారం మధ్యాహ్నం తాము అటుగా వస్తుండగా ఒక వ్యక్తి సడెన్‌ గా స్లోగన్స్‌ చేశాడని కేరళకు  చెందిన వ్యక్తి వివరించాడు. వెంటనే తముకు అతనితో చేరి కొద్ది సేపు స్లోగన్స్‌ ఇచ్చామన్నారు. అయితే..కొందరు వీడియో తీస్తుండటం గమనించి వెంటనే అక్కణ్ణుంచి వెళ్లిపోయామని వివరించారు.  

గల్ప్ కంట్రీస్ చట్టాల మేరకు ముందస్తు అనుమతి లేకుండా సమావేశాలు పెట్టుకోవటం, నినాదాలు చేయటం నేరం. అంతేకాదు..ఇతర దేశాల పాలసీ మేటర్ కు సంబంధించి ఆందోళనలు కూడా చట్టవిరుద్ధం. ప్రవాసీయులు పబ్లిక్ ప్లేసుల్లో ఇస్టానుసారంగా గుమికూడినా, నినాదాలు చేసిన పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com