ఒమన్ రూలర్ సుల్తాన్ ఖబూస్ కోలుకోవాలని దేశవ్యాప్తంగా ప్రార్థనలు
- December 27, 2019
ఒమన్ రూలర్ సుల్తాన్ ఖభూస్ హెల్త్ కండీషన్ మరింత క్రిటికల్ గా మారింది. దీంతో ఆయన కోలుకోవాలంటూ దేశవ్యాప్తంగా ప్రజలు ప్రార్థనలు చేస్తున్నారు. సుల్తాన్ ఆరోగ్యం మెరుగుపడాలని కోరుతూ ప్రార్థిస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్టింగ్ లు వెల్లువెత్తుతున్నాయి. 'లాంగ్ లీవ్ రూలర్', ' రూలర్ త్వరగా కోలుకోవాలంటూ' ట్విట్టర్, ఇన్స్ స్టాగ్రామ్ లో ప్రజలు పోస్టింగ్స్ పోస్ట్ చేస్తున్నారు.
దీర్ఘకాల వ్యాధితో బాధపడుతున్న సుల్తాన్ ఖబూస్ కొన్నాళ్లు విదేశాల్లో చికిత్స పొందుతున్నారు. కానీ, ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా మారటంతో..అతని వారసుడి ఎంపికపై చర్చ వేడెక్కింది. అయితే..రూలర్ తన తరువాతి వారసుడి పేరును ఓ సీల్డ్ కవర్ దాచిపెట్టారు. తాను చనిపోయిన తర్వాత కవర్ ఓపెన్ చేయాలని కండీషన్ విధించారు. దీంతో రూలర్ సుల్తాన్ ఖబూస్ స్థానంలో అతని వారసుడిగా ఎవరు రాబోతున్నారనేది ఉత్కంఠ రేపుతోంది.
సుల్తాన్ ఖభూస్ 1940లో సలాల లో జన్మించారు. ఐదు దశాబ్దాల పాటు మకుటం లేని మహారాజుగా ప్రజల మన్నలు అందుకున్నారు. గల్ఫ్ కంట్రీస్ తో సత్సంబంధాలు కొనసాగిస్తూ దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







