ఫ్రాడ్‌ కేసులో విట్‌నెస్‌ల అరెస్ట్‌కి ఆదేశం

- December 27, 2019 , by Maagulf
ఫ్రాడ్‌ కేసులో విట్‌నెస్‌ల అరెస్ట్‌కి ఆదేశం

బహ్రెయిన్‌: హై క్రిమినల్‌ కోర్ట్‌, ఓ ఫ్రాడ్‌ కేసులో సాక్షుల (విట్‌నెస్‌లు) అరెస్ట్‌కి ఆదేశాలు జారీ చేసింది. 38 మంది అమాయకుల నుంచి 1 మిలియన్‌ బహ్రెయినీ దినార్స్‌ని దోచేసిన ఇద్దరు నిందితులకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాల్సి వుంది సదరు సాక్షులు. ఇద్దరు వ్యక్తులు ఓ ఫేక్‌ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీని స్థాపించి, బాధితుల్ని నిండా ముంచేశారు. కాగా, మోసపోయామని తెలుసుకున్న బాధితులు, నిందితులపై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. బాధితుల్లో కొందరు సౌదీ అరేబియాకి చెందినవారూ వున్నారు. 2015 నుంచి 2017 మధ్యలో ఈ కుంభకోణం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com