పట్టుకోండి చూద్దాం..పోలీసులకు సవాల్ గా మారిన కువైట్ దొంగ
- December 27, 2019
కువైట్:నేరగాళ్లపై ఉక్కుపాదం మోపే గల్ఫ్ కంట్రీస్ లో ఓ దొంగ దుస్సాహసం కువైట్ పోలీసులకు సవాల్ గా మారింది. అతను చేసిన రెండు చోరీ కేసులు పోలీసులకు ప్రెస్టేజ్ ఇష్యూగా మారింది. వివరాల్లోకి వెళ్తే..కువైట్ లోని సుర్రాలో ఓ దొంగ బార్బర్ షాపులోకి చొరబడి డబ్బు ఎత్తుకెళ్లిపోయాడు. వెళ్తూ వెళ్తూ సీసీ కెమెరా రికార్డర్ ను కూడా తీసుకెళ్లిపోయాడు. అయితే..గతంలో లాండ్రీ షాపులో కూడా అచ్చం ఇలాంటి దొంగతనమే జరిగింది. అక్కడ కూడా దొంగ డబ్బు, సీసీ కెమెరా రికార్డర్ ఎత్తుకెళ్లిపోయాడు. దీంతో బార్బర్ షాపులో చోరీకి పాల్పడిన వ్యక్తే లాండ్రీ షాపులోనూ చోరికి పాల్పడినట్లు పోలీసులు ప్రధామికంగా నిర్ధారణకు వచ్చారు. లాండ్రీ షాపు యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







