సలాలా, అలెగ్జాండ్రియాలకు సీజనల్ విమానాల్ని పెంచనున్న ఎతిహాద్
- December 27, 2019
ఎతిహాద్ ఎయిర్వేస్, అబుదాబీ నుంచి సలాలా, ఒమన్ అలాగే అలెగ్జాండ్రియా, ఈజిప్ట్లకు జూన్ 25 నుంచి సెప్టెంబర్ 15 మధ్య అదనంగా సర్వీసుల్ని నడపనుంది. ఈ ఏడాది ఈ రూట్స్‌లో సాధించిన సక్సెస్‌తో, వచ్చే ఏడాది సర్వీసుల్ని పెంచడంతోపాటు, సీజన్‌ని 3 వారాలపాటు పెంచడానికి అలాగే ఐదవ వీక్లీ సర్వీస్‌ని ప్రవేశపెట్టడానికీ నిర్ణయం తీసుకున్నట్లు ఎతిహాద్ సంస్థ పేర్కొంది. ప్రస్తుతం మంగళ, గురు, శని అలాగే ఆదివారాలతోపాటు శుక్రవారం కూడా విమానాలు ప్రయాణమవుతాయి. ఎయిర్‌బస్ ఎ320 విమానాల్ని ఈ మార్గాల్లో నడుపుతారు. వారానికి 26 విమానాల్ని ఒమన్‌కి నడుపుతారు. అందులో మస్కట్‌కి 21, సలాలాకి 5 విమానాలుంటాయి. ఈజిప్ట్‌కి మొత్తం 33 విమానాలు నడుపుతారు. అందులో 28 కైరోకి, ఐదు అలెగ్జాండ్రియాకి నడుపుతారు.
తాజా వార్తలు
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'