సౌదీ అరేబియా: వింటర్ ఫెస్టివల్ కు సిద్ధమైన పోర్ట్ సిటీ జాజన్

- December 29, 2019 , by Maagulf
సౌదీ అరేబియా: వింటర్ ఫెస్టివల్ కు సిద్ధమైన పోర్ట్ సిటీ జాజన్

రియాద్ : 12వ వింటర్ ఫెస్టివల్ కు సౌదీ అరేబియాలోని పోర్ట్ సిటీ జాజన్ సిద్ధమైంది. ఫెస్టివల్ కోసం జాజన్ హెరిటేజ్ విలేజ్ లో అభివృద్ధి పనులను నిర్ణీత గుడువులోగా పూర్తి చేశారు. 2009 నుంచి జాజన్ లో వింటర్ ఫెస్టివల్ నిర్వహిస్తుండగా ఈ ఏడాది 'బ్యూటీఫుల్ జాజన్, ఎవ్రీ వన్స్ వింటర్ రిసోర్ట్' స్లోగన్ తో ఈవెంట్ నిర్వహిస్తున్నారు. వింటర్ సెషన్ కు వచ్చే విజిటర్లకు అహ్లాదపరిచేలా ఏర్పాట్లు చేశారు. చెట్లు, పార్క్ లతో గ్రీనరీ స్పెస్ ను అభివృద్ధి చేశారు. సందర్శలకు అవసరమైన షాపులు, పాత్ వేస్ నిర్మించారు. జాజన్ కవులు, రచయితలు రాసిన కల్చరల్ బుక్స్ చదువుకునేలా రిలాక్సేషన్ ఏరియాస్ ను డెవలప్ చేశారు. జజాన్ స్థానిక వారసత్వాన్ని, సాంప్రదాయలను, పర్యాటక విశేషాలను తెలియజేసేలా సినిమాలు, డాక్యుమెంటరీలు ప్రదర్శించేందుకు మూవీ షోస్ ప్రదర్శించనున్నారు. జాజన్ హిస్టరీని, లైఫ్ స్టైల్ ప్రతిబింబించేలా హెరీటేజ్ విలేజ్ లో పర్వత ప్రాంతాలకు అనువుగా ఉండే మట్టి ఇల్లు, ఫరాసన్ ద్వీపానికి రిప్రజెంట్ చేసేలా ఇళ్లను నిర్మించారు. 12వ వింటర్ ఫెస్టివల్ లో ఈ హెరిటేజ్ విలేజ్ ప్రధాన ఆకర్షణగా నిలవనుందని అధికారులు చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com