మస్కట్: ఫారెన్ పెట్టుబడులు సులభతరం చేస్తూ 'న్యూ ఇన్వెస్ట్ మెంట్ లా' అమలు

- January 02, 2020 , by Maagulf
మస్కట్: ఫారెన్ పెట్టుబడులు సులభతరం చేస్తూ 'న్యూ ఇన్వెస్ట్ మెంట్ లా' అమలు

విదేశీ పెట్టుబడులను ఆకర్షించటమే లక్ష్యంగా ఒమన్ ప్రభుత్వం న్యూ ఫారెన్ ఇన్వెస్ట్ మెంట్ చట్టానికి గ్రీన్ సిగ్నీల్ ఇచ్చింది. ఇవాళ్టి (జనవరి 2) నుంచే విదేశీ పెట్టుబడి కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. ఈ మేరకు మినిస్ట్రి ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ-MOCI ఒక ప్రకటన విడుదల చేసింది. సుల్తానేట్లో  ఫారెన్ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇన్వెస్టర్లకు సులభతరంగా ఉండేలా ప్రొసిజర్ అమలు చేస్తున్నట్లు పేర్కొంది. కొత్త చట్టం ప్రకారం ఫారెన్ ఇన్వెస్టర్లకు గతంలో కంటే ఈజీగా అనుమతులు లభించేలా వెసులుబాటు ఉంటుంది. తద్వారా దేశంలోకి విదేశీ కేపిటల్ ఇన్వెస్ట్ మెంట్ ను పెంపొందించుకోవటంతో పాటు మౌళికసదుపాయల అభివృద్ధి, స్థానికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కూడా మెరుగుపర్చుకునే అవకాశం ఉంటుందని MOCI తన ప్రకటనలో వివరించింది. దేశంలో పెట్టుబడులు పెట్టాలనుకునే విదేశీ ఇన్వెస్టర్ల నుంచి మినిస్ట్రి ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అప్లికేషన్లను స్వీకరిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com