రామోజీ ఫిల్మ్ సిటీలో అజిత్ సినిమా షూటింగ్ పూర్తి
- January 03, 2020
అజిత్ ప్రస్తుతం 'వాలిమై' చిత్రం చేస్తున్నాడు. గత కొన్ని రోజులుగా ఈ చిత్ర షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుపుకుంటూ రాగా..నిన్నటి తో ఈ సినిమా షూటింగ్ ఫిలిం సిటీ లో పూర్తి చేసుకున్నట్లు సమాచారం. హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి కావడం తో చిత్ర యూనిట్ చెన్నైకి చేరుకున్నారు. తదుపరి షెడ్యూల్ చెన్నైలో జరగనుందని సమాచారం.
అజిత్ గత చిత్రం 'నెర్కొండ పారవై'ను డైరెక్ట్ చేసిన హెచ్.వినోత్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇందులో అజిత్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. ఈ చిత్రంలో కథానాయకిగా యామీ గౌతమ్ నటించనుందని గతంలో వార్తలొచ్చాయి. అయితే ఇందులో ఇంకో హీరోయిన్ పాత్ర కూడా ఉందట. ఆ పాత్ర కొసం ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇలియానాను తీసుకోవాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నట్టు కోలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..