SPMCILలో ఉద్యోగావకాశాలు

- January 03, 2020 , by Maagulf
SPMCILలో ఉద్యోగావకాశాలు

సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌(SPMCIL) ఆధ్వర్యంలోని సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్- హైదరాబాద్‌ కేంద్రంగా వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టుల వారీగా తగిన విద్యార్హతలను నిర్ణయించారు. సరైన విద్యా అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం రాతపరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మొత్తం ఉన్న ఖాళీల సంఖ్య 29.

పోస్టుల వారీగా ఉన్న ఖాళీల వివరాలు

జూనియర్ టెక్నీషియన్‌ (ప్రింటింగ్‌): 26

ఫైర్‌మెన్‌ (రిసోర్స్ మేనేజ్‌మెంట్‌): 03

​అర్హతలు: జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధిత విభాగంలో ఐటీఐ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.

దీంతో పాటు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్ (NCVT) నుంచి ఏడాది నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ పొంది ఉండాలి.

ఫైర్‌మెన్‌ ఉద్యోగాలకు పదోతరగతి అర్హతతో పాటు సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన సంస్థ నుంచి సర్టిఫికేట్ కలిగి ఉండాలి.

వయోపరిమితి: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 01.01.2020 నాటికి 18 - 25 సంవత్సరాల మధ్య వారై ఉండాలి. 02.01.1995 నుండి 01.01.2002 సంవత్సరాల మధ్య జన్మించిన వారై ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.

దరఖాస్తు చేసుకునే విధానం : సరైన అర్హతలు ఉన్న వారు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపికల విధానం: ఆన్‌లైన్ రాతపరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

పరీక్ష ఫీజు: అభ్యర్థులు పరీక్ష ఫీజుగా రూ.400 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

జీతం: ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.7,750 - రూ.19,040 జీతంగా పొందుతారు.

దరఖాస్తు ప్రక్రియ, ఫీజు చెల్లింపు ప్రారంభ తేదీ 01.01.2020, దరఖాస్తుకు చివరితేది 08.02.2020, ఫీజు చెల్లించడానికి చివరి తేది 08.02.2020.

రాతపరీక్ష నిర్వహించే తేది: మార్చి/ ఏప్రిల్ - 2020

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com