మచిలీపట్నం లోని అభిమానులకు నిరాశ మిగిల్చిన మహేష్ బాబు
- January 05, 2020
మచిలీపట్నం : సంక్రాంతి సంబురాల పేరిట మచిలీపట్నంలో నిర్వహించిన ఓ టీవీ షోకు వచ్చిన సినీ హీరో మహేష్‌బాబును చూసే అవకాశం అభిమానులకు దక్కలేదు. టీవీ షోలో పాల్గొనేందుకు మహేష్‌బాబు మచిలీపట్నంలోని ఆంధ్ర జాతీయ కళాశాలలో ఏర్పాటు చేసిన వేదిక వద్దకు శనివారం సాయంత్రం చేరుకున్నారు. కానీ ఇదే సమయంలో వర్షం పడటంతో సంబరాల్లో పాల్గొనకుండానే ఆయన వెనుదిరిగారు. ఆయన వెళ్లిన కొద్దిసేపటికి వర్షం తగ్గింది. రాత్రికి యధావిధిగా టీవీ షో నిర్వహించారు.
కాగా, మహేష్ సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగటంతో అధిక సంఖ్యలో అభిమానులు ఏజే కళాశాల ప్రాంగణానికి చేరుకున్నారు. కానీ మహేష్ బాబు వెళ్లిపోయారని తెలియటంతో అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. కాగా, మహేశ్ తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో జరగనుంది. ఈ చిత్రం జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..