చిరంజీవి, మహేష్, విజయశాంతి ఒకచోట కనిపిస్తున్న వేళ పోలీసుల కసరత్తు
- January 05, 2020
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. అన్ని కార్యక్రమాలని పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 11న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. అనిల్ రావిపూడి దర్శత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మహేష్ బాబు ఆర్మీ మేజర్ గా నటించాడు. దాదాపు 13 ఏళ్ల తర్వాత లేడీ అమితాబ్ విజయశాంతి వెండి తెరపై మెరవబోతున్న చిత్రం ఇది. దీనితో సరిలేరు నీకెవ్వరు మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
రిలీజ్ కు కొద్దిరోజుల సమయం మాత్రమే ఉండడంతో చిత్ర యూనిట్ భారీ ప్రమోషనల్ ఈవెంట్ కు రెడీ అవుతోంది. నేడు(ఆదివారం జనవరి 5) హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. మహేష్ సినిమా కోసం తొలి సారి మెగాస్టార్ చిరంజీవి అతిథిగా హాజరుకానున్నారు. మెగాస్టార్, సూపర్ స్టార్, విజయశాంతి ఒకే వేదికపై కనిపించబోతుండడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొని ఉంది.
ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ కు భారీ సంఖ్యలో అభిమానులు హాజరు కానున్నారు. దీనితో హైదరాబాద్ నగర పోలీసులు ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని అడిషనల్ సిపి అనిల్ కుమార్ ప్రకటించారు.
ఏఆర్ పెట్రోల్ పంప్ నుంచి వచ్చే వాహనాల్ని నాంపల్లి వైపు మళ్లించనున్నారు. అబిడ్స్ నుంచి వచ్చే వాహనాల్ని గన్ ఫౌండ్రి వైపు, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్ట్రర్స్, బషీర్ బాగ్ నుంచి వెళ్లే వాహనాల్ని హిమాయత్ నగర్ వైపు మళ్లిస్తారు. లిబర్టీ నుంచి వచ్చే వాహనాల్ని హిమాయత్ నగర్ వైపు మళ్లిస్తారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలని దృష్టిలో పెట్టుకుని వాహనదారులు రద్దీని నివారించాలని పోలీసులు కోరుతున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..